స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ మహిళలు, బాలికలు, సీనియర్ సిటిజన్‌లపై దృష్టి సారించి సమాజంలోని ప్రత్యేక వర్గానికి మద్దతుగా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపడుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని వివేకానంద సేవా సంఘం స్వచ్ఛంద సంస్థలో హైదరాబాద్‌లోని ఎస్‌బిఐ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు రష్మీ సిన్హా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
వివేకానంద సేవా సంఘానికి కిరాణా సామాగ్రి, హోజరీ వస్తువులు, పరిశుభ్రత సంరక్షణ, పిల్లలకు టీ-షర్టులు, సీనియర్ సిటిజన్‌లకు దుస్తులు ఇతర అవసరమైన వస్తువులను రష్మీ సిన్హా అందజేశారు. సీనియర్ సిటిజన్లకు వైద్య శిబిరం నిర్వహించి, మందులు, టానిక్, హెల్త్ సప్లిమెంట్లను అందించారు. ఎస్.బీ.ఐ. లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు రష్మీ సిన్హా ఈ సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఎన్.జీ.వో. ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రష్మీ సిన్హా మాట్లాడుతూ..లేడీస్ క్లబ్ సభ్యుల నుండి సేకరించిన నిధులతో లేడీస్ క్లబ్ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగమైనందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఎన్జీవో 38 మంది అనాధ బాలికలకు మంచి వసతి, పౌష్టికాహారం అందిస్తూ వారికి విద్యను అందించేందుకు కృషిచేస్తోందన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మిలి వర్మ, సెక్రటరీ శ్రీమతి అనిత శర్మ, ఇతర మహిళా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.