Friday, December 20, 2024
Homeట్రేడింగ్SBI mega property show: స్టేట్ బ్యాంక్ మెగా ప్రాపర్టీ షో

SBI mega property show: స్టేట్ బ్యాంక్ మెగా ప్రాపర్టీ షో

దూసుకుపోతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షో ఊరించేలా సాగుతోంది. ఈనెల 20, 21 & 22 తేదీల్లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్-4లో బిగ్గెస్ట్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోను మెగా ఈవెంట్‌ గా నిర్వహిస్తోంది. గత 4 సంవత్సరాలుగా ప్రముఖ బిల్డర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ మెగా ఈవెంట్‌ను స్టేట్ బ్యాంక్ నిర్వహిస్తోంది.

- Advertisement -

హైదరాబాద్ సర్కిల్ సిజిఎం రాజేష్ కుమార్ ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో ప్రారంభించారు. మంజు శర్మ, చీఫ్ జనరల్ మేనేజర్ REHBU, కార్పొరేట్ సెంటర్, ముంబై, జనరల్ మేనేజర్లు హైదరాబాద్ సర్కిల్‌కు చెందిన ప్రకాష్ చంద్ర బారోర్, రవి కుమార్ వర్మ, బ్యాంక్ ఇతర సీనియర్ ప్రముఖులతోపాటు, క్రెడాయ్ అధ్యక్షులు వి రాజశేఖర్ రెడ్డి, ఐజీబీసీ ఉపాధ్యక్షుడు శేఖర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  


ఆర్. బాలానంద్, DGM, REHBU హైదరాబాద్ సర్కిల్ మాట్లాడుతూ ఎస్బీఐపై కస్టమర్ల విశ్వాసం అపారమైందన్నారు. ఈ ఈవెంట్‌కు విస్తృత ప్రచారం కల్పించామని, మెగా ప్రాపర్టీ షోలో భాగం కావడానికి చాలా మంది బిల్డర్లు ఆసక్తిని కనబరుస్తున్నారని అన్నారు. కాగా నగరానికి చెందిన 50 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 4వ అత్యంత విశ్వసనీయమైన బ్యాంక్‌గా ఎస్‌బీఐ గుర్తింపు పొందిందని తెలిపారు. నిబద్ధతతో కూడిన సేవలు అందిస్తున్నందునే ఇది సాధ్యమైందన్నారు. గృహ రుణాల మంజూరులో 8 ట్రిలియన్ల మార్కును స్టేట్ బ్యాంక్ త్వరలో అధిగమించనుందన్నారు. బిల్డర్లు, కస్టమర్ల నుండి నిరంతర మద్దతు, ప్రోత్సాహం కారణంగా మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు. విద్య, ఫార్మా, ఆరోగ్యం, వాతావరణం నివాస గృహాలు, వాణిజ్య స్థలం, పెట్టుబడి మార్కెట్ పరంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ అపారంగా ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్, టూరిజం, ఇతర పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న కారణంగా గృహ రంగానికి డిమాండ్ కు మార్గం సుగమం చేసిందన్నారు.

కార్పొరేట్ సెంటర్ ముంబై సీజీఎం మంజు శర్మ మాట్లాడుతూ జీడీపీలో రియల్ ఎస్టేట్ గేమ్ ఛేంజర్ అన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వృద్ధి రేటు 7% ఉండగా 2047 నాటికి ఇది 10% CAGR వద్ద 17%కి చేరుతుందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం 14 % వృద్ధిని సాధిస్తున్న సంస్థగా స్టేట్ బ్యాంక్ ఉందన్నారు. భారతదేశంలోని మొత్తం హౌసింగ్ స్టాక్‌లో 12% హైదరాబాద్‌దేనని మంజు అన్నారు.
హౌసింగ్ రంగంలో హైదరాబాద్ గత 5 సంవత్సరాలలో 2.2 రెట్లు, గత 10 సంవత్సరాలలో 3.3 రెట్లు వృద్ధి చెందుతోంది. స్టేట్ బ్యాంక్ కాంబో లోన్, మాక్స్‌గెయిన్ – హైబ్రిడ్ వంటివి ఆమె వివరించారు.


క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి తన ప్రసంగంలో, ఎస్‌బిఐ ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీ ఎక్స్‌పో నిర్వహించడం అభినందనీయమన్నారు. పరిశ్రమలు లేవనెత్తిన ఆందోళనలను క్రెడాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, సానుకూల ఫలితం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదపడుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరం 115 కంపెనీల ద్వారా 35000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని, నవంబర్ 23 నుండి డిసెంబర్ 24 వరకు 51000 మందికి పైగా ఉపాధిని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. కస్టమర్లందరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై నమ్మకాన్ని పెంచుకోవాలని, మెగా ఎక్స్‌పోను తమ కలల ఇంటిని ఎంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఐజిబిసి వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రీడీ తన ప్రసంగంలో మెగా బ్యాంకర్ నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోను అభినందించారు. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి పెంపుదల, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్‌టి వంటివి సరసమైన గృహాల విభాగంలో వృద్ధికి ఊతమిస్తాయని ఆయన సూచించారు. IGBC ప్రాపర్టీలకు 5 bps అందించడమే కాకుండా 20 bps అదనపు రాయితీని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News