Saturday, July 27, 2024
Homeట్రేడింగ్Shamshabad: శంషాబాద్‌ వైపు రియల్ పరుగులు

Shamshabad: శంషాబాద్‌ వైపు రియల్ పరుగులు

మహానగరం హైదరాబాద్‌ నలువైపులా రియల్‌ రంగం శరవేగగంగా విస్తరిస్తోంది. అయితే .. సిటీ నలుదిక్కులా శరవేగంగా విస్తరించడంతో కొనుగోలుదారులు అయోమయంలో పడుతున్నారు.సిటీకి కూతవేటు దూరంలో ఉండాలి. ధరలు అందుబాటులో ఉండాలి. ఐటీ కారిడార్‌కు సమీపంగా, ఆఫీసులకు అందుబాటులో ఉండేవిధంగా అపార్టమెంట్లు, ఇండిపెండెంట్ విల్లాలు.. ఓపెన్‌ ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే .. కొనుగోలుదారుల డిమాండ్‌కు సరిగ్గా సరిపోయే ఏరియా శంషాబాద్‌ రూట్‌ అని రియల్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకే సిటీకి సౌత్‌ వైపు పెట్టుబడులకు అనుకూలమని సూచిస్తున్నారు.

- Advertisement -

అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌ లో ఏర్పాటైన తర్వాత ఆ రూట్‌లో రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంది. అయితే, ఇటీవల కాలంలో శంషాబాద్‌ రియల్ రంగం పరుగులు పెడుతోంది. ఏరో సిటీతోపాటు పలు కొత్త టౌన్‌షిప్‌లు రానుండడం. ప్రముఖ విద్యాసంస్థలు శంషాబాద్‌ వైపు బ్రాంచ్‌లను విస్తరించడానికి ఏర్పాట్లతో పాటు మెట్రో విస్తరణ కూడా శంషాబాద్‌లో రియాల్టీ రంగం అభివృద్ధికి ప్రధాన కారణాలు. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న సైకిల్‌ ట్రాక్‌ పనులు శరవేగంగా జరుగుతుండడం అవుటర్ రింగ్ రోడ్డు నుండి ఐటీ కారిడార్‌కు కేవలం 40 నిమిషాల్లో చేరుకోవడం కూడా శంషాబాద్‌ రియల్‌ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి ప్రధాన కారణాలు. హెచ్‌ఎండీఏ కొత్తగా బుద్వేల్‌లో వేయబోతున్న భారీ లేఅవుట్లో ప్లాట్‌లు కొనడానికి సామాన్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ జలాశయం అందాలు.. కొండలు, పచ్చదనం.. ఈసీ, మూసీ వాగు, కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌.. వంటి అదనపు హంగుల కారణంగా హైదరాబాద్‌ సౌత్‌ శంషాబాద్‌ వైపు స్థిరాస్తి రంగం క్రమంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి ఒక వైపు కొల్లూరు.. మరోవైపు శంషాబాద్‌ వైపు రియల్‌ ఎస్టేట్‌ విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అంచనాలు నిజమవుతున్నాయి. శంషాబాద్‌ వైపు క్రమంగా నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సోషల్‌ ఇన్‌ఫ్రా మెరుగవుతుండటంతో కొత్త ప్రాజెక్టుల రాక మొదలైంది.

అందుబాటు ధరలు
సిటీలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ సౌత్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లకు ఈ ప్రాంతం నిలయంగా ఉంది. అయినా రియల్‌ ఎస్టేట్‌ పరంగా ఇన్నాళ్లు ఆఖర్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడం, పేరున్న విద్యాసంస్థలు రావడం, మెట్రో వస్తుండటంతో అందరిచూపు అటువైపు మళ్లింది. గచ్చిబౌలి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉండే అప్పా, బండ్లగూడ వరకు ఇదివరకే జనావాసాలు వచ్చాయి. ఇక్కడ పలు గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి క్రమంగా కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వైపు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ మధ్యలో సాతంరాయి చుట్టుపక్కల బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాల నిర్మాణంలో ఉన్నాయి. బుద్వేల్‌లో 200 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌ వేయబోతుంది. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, ఆకాశహర్మ్యాల భవనాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక ఆకర్షణగా మెట్రో
రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఈ ప్రాంతం మీదగానే వెళ్తుంది. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. కాస్త ఆలస్యమైనా ప్రాజెక్ట్‌ రావడం మాత్రం ఖాయం కావడంతో ఈ ఏరియాలో రియల్ రంగం రెక్కలు విప్పుతోంది.మెట్రోతో దీంతో ప్రజారవాణా మెరుగు అవుతుంది. అప్పా, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో స్టేషన్లు రాబోతున్నాయి. వీటి కేంద్రంగా నివాసాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం ప్రాంగణంలో ఏరో సిటీ నిర్మిస్తున్నారు. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆగాఖాన్‌ అకాడమీతోపాటు పేరున్న పది విద్యాసంస్థలు హైదరాబాద్‌ సౌత్‌లో అత్తాపూర్‌ నుంచి బండ్లగూడ, శంషాబాద్‌ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణం వైపు ఇంటి నివాసాలకు ఆమోదయోగ్యంగా, అనువుగా మారుతున్నాయి.
విల్లాలూ అందుబాటులోనే
సిటీకి దగ్గరలో గేటెడ్‌ కమ్యూనిటీల్లో చదరపు అడుగు ఐదారువేల రూపాయల ధరల్లోనే లభిస్తున్న ప్రాంతాల్లో శంషాబాద్‌ ఏరియా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాయి. పలు విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ధరలు కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. మెట్రో విస్తరణ, బుద్వేల్‌ లేఅవుట్‌, శంషాబాద్‌ విస్తరణ ప్రణాళికలతో ఇటీవల కాలంలో ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది. జీవో 111 పరిధిలో ఎక్కువ భూములు ఉండటంతో అక్కడ ఫామ్‌హోమ్స్‌, వీకెండ్‌ హోమ్స్‌ నిర్మించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News