వాసవి గ్రూప్ అంటేనే రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. 30 సంవత్సరాల వారసత్వంతో వాసవీ గ్రూప్ తన కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది. ప్రాజెక్టలను ఖచ్చితమైన సమాచారం ఇస్తూ తన కస్టమర్లకు పారదర్శకతతో వ్యవహరిస్తోంది. ఇవే అంశాలపై సంస్థ గ్రూప్ డైరెక్టర్లు, తమ భవిష్యత్ ప్రణాళికలను, సంస్థ నిర్వహిస్తున్న సీఎస్ఆర్ కార్యక్రమాలను సగర్వంగా మీడియాతో పంచుకున్నారు.
వాసవి గ్రూప్ సంస్థల డైరెక్టర్ అభిషేక్ చందా మాట్లాడుతూ.. వాసవి గ్రూప్ నాణ్యత, సమగ్రత, ఆవిష్కరణలు, అసమానమైన సేవల పునాదులపై సంస్థను విజయపథంలో నడిపిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో స్థాపించిన వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉందని, జంట నగరాల్లో 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు 17 వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలను సంస్థ చేపట్టిందన్నారు. ఇవన్నీ సంస్థను మరో దశాబ్దంపాటు ముందుకు తీసుకెళ్లే విజయాలుగా ఆయన కొనియాడారు.
సంస్థ హైలైట్స్..
30 నివాస సముదాయాలు, 17 వాణిజ్య సముదాయాలు, 310 ఎకరాల విల్లా ప్లాట్లు, 4,510 అపార్ట్మెంట్లు నిర్మించిన వాసవి సంస్థ 8 మిలియన్ చదరపు అడుగులు నిర్మించారు. 50 మిలియన్ చదరపు అడుగులు 5 ఏళ్ల లక్ష్యంతో దూసుకుపోతున్న ప్రతిష్ఠాత్మక సంస్థగా వాసవి గ్రూప్ ప్రస్థానం ఘనంగా సాగింది.
వాసవి సరోవర్..
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో ఉన్న వాసవీ సరోవర్ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ప్రతిష్ఠాత్మకమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా చెక్కుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కూకట్ పల్లిలోని వాసవీ సరోవర్ పక్కనే ఉన్న చిన్న మైసమ్మ సరస్సుతో పాటు రెండు సరస్సులను సుందరీకరణను సంస్థ స్వయంగా చేపట్టింది. మైసమ్మ సరస్సు సుందరీకరణమను సీఎస్ఆర్ కింద అభివృద్ధి చేస్తూ, సరస్సుపై ఎటువంటి నిర్మాణాలను చేపట్టడం లేదని సంస్థ స్పష్టంచేస్తోంది. తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నట్టు వాసవి సంస్థ వెల్లడించింది.
వాసవి అర్బన్..
హైదరాబాద్ లోని బాచుపల్లిలో వాసవి సంస్థ చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మకమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వాసవీ అర్బన్ ను నిర్మిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోమటి కుంట సరస్సుతో సహా మరో రెండు సరస్సుల సుందరీకరణను సైతం ఇక్కడే చేపడుతోంది వాసవి గ్రూప్. ఈమేరకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులను పొందారు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా ప్రాజెక్టును కొనసాగిస్తున్నట్టు వాసవి యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులన్నీ పూర్తి చట్టపరమైన సమ్మతితో మరింత పారదర్శకతతో అభివృద్ధి చేస్తూ, పర్యావరణాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వాసవి గ్రూప్ తెలిపింది. సోషల్ మీడియా గ్రూపుల్లో తమపై దుష్ప్రచారం సాగుతోందని, వాటిని నమ్మద్దని అభిషేక్ చందా చెప్పుకొచ్చారు. పర్యావరణ అనుకూలమైన విధానాలను మాత్రమే వాసవి సంస్థ అనుసరిస్తుందని అభిషేక్ తెలిపారు.