Sunday, September 29, 2024
Homeట్రేడింగ్World heart day: అత్యాధునిక హార్ట్ కేర్ కేరాఫ్ కేర్ హాస్పిటల్స్

World heart day: అత్యాధునిక హార్ట్ కేర్ కేరాఫ్ కేర్ హాస్పిటల్స్

గుండె ఆరోగ్యానికి జీవనశైలిలో మార్పులు, వైద్యం కీలకం

గుండె ..మన జీవితాన్ని నడిపించే అసలైన స్నేహితుడు, చివరి దాకా మనకు తోడుగా నిలిచే ఈ రక్తసంబంధ అవయవం చేసే సేవ అమోఘం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గుండెకు అనేక సమస్యలు కలుగుతున్నప్పటికీ, అది తట్టుకుని మన జీవితానికి మద్దతు ఇస్తూ మనకు ఊపిరినిస్తూనే ఉంటుంది. కానీ, అది ఆగిపోయిన రోజే మన ప్రస్థానం ముగుస్తుంది. ఇంతటి మేలు చేస్తున్న ఈ అంతర్గత స్నేహితుని పట్ల మనం సరైన శ్రద్ధ చూపటం చాలా అరుదు.

- Advertisement -

దానిని సరిగ్గా పని చేయనివ్వకుండా, ధూమపానం, మద్యం, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకర అలవాట్లతో గుండెకు అనేక సమస్యలు సృష్టిస్తాం. గుండె మనం మితిమీరుతున్నామనే హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వాటినే కొనసాగిస్తుంటాం. దీంతో గుండె ఆఖరికి ఒత్తిడిని తట్టుకోలేక, అలసి సొలసి, పని చేయలేక ఆగిపోతుంది.

అత్యధిక మరణాలు హార్ట్ ఫెయిల్ తోనే..

దేశంవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మరణాలకు, దీర్ఘకాల అనారోగ్యాలకు హార్ట్ ఫెయిల్యూర్ ఓ ప్రధాన కారణంగా తయారవుతున్నది. జనాభాలో రెండు శాతం మంది దీని వల్ల బాధపడుతున్నారు. ఆయుఃప్రమాణం పెరుగుతుండటం, మరోవైపు ఆనారోగ్యకర జీవన శైలులు, విస్తరిస్తున్న వాతావరణ కాలుష్యంతో హార్ట్ ఫెయిల్యూర్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన ఆస్పత్రులకు చెందిన ఐ.సి.యూ.లలో చేరుతున్న వారిలో హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటమేకాదు ఎప్పటికప్పుడు కొత్త హృద్రోగ రోగుల సంఖ్యనూ పెరుగుతుండటం మానవాళికి ఓ హెచ్చరికగా మారింది.

కార్డియాలజిస్టులు సర్వ సన్నద్ధంగా ఉండే ఆసుపత్రి..
ఈ పరిస్థితులలో మన రాష్టంలోని అగ్రశ్రేణి వైద్య సంస్థలు గుండె వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు దేశంలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. గుండె వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలు, పరిణామాల ఫలితాలు అతి కొద్ది సమయంలోనే రాష్ట్రంలో అందుబాటులోకి వస్తున్నాయి. వేగంగా, నిరంతరాయంగా సాగుతున్న ఈ అభివృద్ధి వల్ల హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషనుతో సహా గుండె వ్యాధుల శస్త్రచికిత్సకు సంబంధించి గడచిన రెండు దశాబ్దాల కాలంలో చాలా మార్పులు వచ్చాయని, ఇందుకు అనుగుణంగా తమ ఆస్ప్తత్రులో అత్యాధునిక వ్యాధినిర్ధారణ, శస్త్రచికిత్స పరికరాలు – సౌకర్యాలను అభివృద్ధిచేశారని కేర్ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు తెలిపారు. నిరంతరాయంగా అందుబాటులో ఉండే కార్డియాలజిస్టులు – సర్జన్లు, సర్వసన్నద్దంగా ఉండే చికిత్సా ఏర్పాట్లతో గుండె వ్యాధులకు సంబంధించి సమస్యలను పరిష్కరించే విధంగా ఈ హార్ట్ ఇనిస్టిట్యుట్ పనిచేస్తునట్లు వారు వెల్లడించారు.

విశేష అనుభవమున్న సర్జన్లు..
కేర్ హాస్పిటల్స్ కు చెందిన కార్డియాలజీ అండ్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య నిపుణులు గుండె వ్యాధులు, గుండె మార్పిడికి సంబంధించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ వైద్య కేంద్రాలలో పనిచేసి, విశేష అనుభవం ఉన్న వైద్య నిపుణులు సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగంలో అధునాతన పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, రక్త నిధి, వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించే లాబొరేటరీ ఉన్నాయి. ఇటువంటి అత్యున్నత స్థాయి ఏర్పాట్లు ఉండి ఆస్పత్రిలో గుండె మార్పిడి చేయించుకోవటం వల్ల గుండె మార్పిడి శస్త్రచికిత్స ద్వారా సత్ఫలితాలు పొందేందుకు వీలుకలుగుతుంది. తిరిగి సాధారణ జీవితాన్ని ఎప్పటిలానే గడిపే సదుపాయం మీరున్న చోటే సాధ్యమవుతుంది.

For More Information:
CARE Hospitals, Malakpet,
Hyderabad
Ph: 040 61 65 65 65
www.carehospitals.com

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News