ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అత్యాధునిక ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్) డివైస్ ను లాంచ్ చేసిన మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ.
యువతలో పెరుగుతున్న హృద్రోగాలు..
అనంతరం డాక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు. గుండె జబ్బులవల్లే దేశంలో అత్యధికులు చనిపోతున్నారని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ మరణాల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఏఈడీలు మరియు సీపీఆర్ ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే డాక్టర్ అందుబాటులో ఉండరు. ఇలాంటప్పుడు తక్షణమే ఏఈడీతో ఎలక్ట్రిక్ షాకిస్తే గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభిస్తుంది. తర్వాత వీలైనంత త్వరగా బాధితుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించడంద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని అన్నారు.
ఏఈడీ ఎవరైనా ఆపరేట్ చేయచ్చు..
అనంతరం మెడికల్ డైరెక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ ఏఈడీలతో షాక్ ఇవ్వడానికి వైద్య నిపుణులక్కర్లేదు. పారామెడికల్స్ కూడా లేకుండా ఒకటి, రెండు సార్లు చూసినవారు (స్వల్ప శిక్షణ పొందినవారు) కూడా ఏఈడీని ఆపరేట్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, జిమ్స్, స్టేడియాలు, బస్సు డిపోలు, క్లబ్లు, సామాజిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, షాపింగ్మాలతోపాటు ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల మరణాల శాతం తగ్గించవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్-సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.