Saturday, November 15, 2025
Homeబిజినెస్2025 Renault Triber: కొత్త రెనాల్ట్‌ ట్రైబర్‌ వచ్చేసింది.. చాలా తక్కువ ధరకే మంచి 7...

2025 Renault Triber: కొత్త రెనాల్ట్‌ ట్రైబర్‌ వచ్చేసింది.. చాలా తక్కువ ధరకే మంచి 7 సీటర్‌!

2025 Renault Triber Launch:భారతీయ మార్కెట్‌లో రెనాల్ట్‌ కార్లకు మంచి డిమాండ్ ఉంది. సబ్-ఫోర్-మీటర్ల ఎంపీవీలో ఈ కంపెనీకి చెందిన ట్రైబర్‌ మంచి మార్కెట్‌ని కలిగి ఉంది. తాజాగా 2025 అప్‌డేట్‌ మోడల్‌ని రెనాల్ట్‌ (Renault Triber 2025) విడుదల చేసింది. దీంతో పాటు సరికొత్త లోగో (ఇంటర్లాక్డ్ డైమండ్ ఆకారం)తో ఈ ట్రైబర్‌ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని బేస్‌ వేరియంట్‌ ధర కేవలం రూ.6.29 లక్షల నుంచే ప్రారంభం అవుతుంది. మాస్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ ఈ ఎంపీవీ రెనాల్ట్‌ ప్రవేశపెట్టింది.

- Advertisement -

వేరియంట్స్‌: ఈ సరికొత్త ఎంపీవీ 5 వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరింయట్‌ ఆథెంటిక్‌ ధర రూ. 6.29 లక్షలు, ఎవల్యూషన్ వేరియంట్ ధర రూ.7.24 లక్షలు, టెక్నో ధర రూ.7.99 లక్షలు, ఎమోషన్ ధర రూ.8.64 లక్షలు, ఎమోషన్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ ధర రూ. 9.16 లక్షలుగా ఉంది. పైవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

డిజైన్‌: అప్‌డేటెడ్‌ వెర్షన్‌ కావడంతో కారు ఎక్ట్సీరియర్‌ లోనూ కొన్ని మార్పులు చేశారు. షార్ప్‌ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, డార్క్ ట్రిమ్ ఎలిమెంట్ ద్వారా కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త హెడ్‌లైట్లను అందిచారు. ఇక దీని కొలతల్లో ఎటువంటి మార్పులు లేవు. ఈ కారుకి రిఫ్రెష్ లుక్‌ని తీసుకువచ్చేందుకు ఫ్రెంచ్ ఆటో మేజర్ షాడో గ్రే, అంబర్ టెర్రాకోటా, జాన్‌స్కర్‌ బ్లూ అనే మూడు కొత్త ఎక్ట్సీరియర్ పెయింట్స్‌ని జోడించారు.

ఇంటీరియర్‌: ఇక ఇంటీరియర్ లోనూ కొన్ని మార్పులు ఎంపికలను జోడించింది. 3 వరుసలలో కొత్త అప్‌హోల్‌స్టరీ, చిన్నపాటి డ్యాష్ బోర్డ్ లేఅవుట్ మార్పులతో ప్రవేశపెట్టబడింది. ఎల్ఈడీ ఇంటీరియర్ లైటింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివైజ్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఈ కొత్త ఎంపీవీలో ఉన్నాయి.

ఇంజిన్‌, ఫీచర్లు: ఇందులోని 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ 71 bhpని 96 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ AMT ఆప్షన్‌ ట్రాన్స్‌మమిషన్‌ ఆప్షన్స్‌ కలవు. ఈ ఎంపీవీ సీఎన్‌జీ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. ఇక ఫీచర్ల పరంగా చూస్తే 8 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ వంటివి ఉన్నాయి. ఇందులో 7 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ కొత్త ట్రైబర్‌పై మూడేళ్ల స్టాండర్డ్‌ వారంటీ లేదా లక్ష కిలోమీటర్ల ప్లాన్‌ని కంపెనీ అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad