ఈ సేల్ అందరికీ కావడంతో భారీ డిస్కౌంట్లు, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు వినియోగదారులకు మంచి షాపింగ్ అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఫ్యాషన్, ఫర్నిచర్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు లభించనున్నాయి. వీటితో పాటు అమెజాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులపై మంచి ఆఫర్లను ఈ కామర్స్ సంస్థ అందించనుంది.
ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా 10% డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, కాంబో డీల్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. సేల్‌లో భాగంగా “8 పీఎం డీల్స్”, “బ్లాక్‌బస్టర్ డీల్స్”, “డెయిలీ లైట్‌నింగ్ డీల్స్” వంటి ప్రత్యేక ఆఫర్లను ప్రత్యేకంగా అమెజాన్ అందించనుంది. అయితే ఇవి పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు కొనుగోలు చేయదలచిన వస్తువులపై ముందుగానే లిస్ట్ తయారుచేసుకుని డీల్స్ ప్రారంభమైన వెంటనే షాపింగ్ చేయడం వల్ల మంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ యాప్‌లో ఈ సేల్‌కు సంబంధించి ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే అన్ని కేటగిరీల్లో ఉండబోయే డీల్స్ వివరాలు అధికారికంగా ప్రకటించనుంది.
ఈ సేల్‌ను స్వాతంత్ర్య దినోత్సవ వేళ వినియోగదారులకు స్మార్ట్ షాపింగ్‌గా నిలువనుంది. కావున తక్కువ ధరలో తమకు నచ్చిన ఉత్పత్తులను సొంతం చేసుకునే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి.


