Apple Announces Fourth Retail Store in India: భారత్‌లో ఆపిల్ తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆపిల్, ఇప్పుడు నాలుగో స్టోర్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ కొత్త స్టోర్ పూణేలోని కోరేగావ్ పార్క్ (Koregaon Park) ప్రాంతంలో సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. బెంగళూరులో మూడో స్టోర్ ప్రారంభం కానున్న కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం.
ALSO READ: Foxconn: ఫాక్స్ కాన్ కీలక నిర్ణయం.. స్వదేశానికి 300 మంది చైనా ఇంజినీర్లు
భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా..
ఆపిల్ తన కొత్త స్టోర్‌లకు, ముఖ్యంగా బెంగళూరు, పూణేలోని స్టోర్‌లకు భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక థీమ్‌లను ఎంచుకుంటుంది. పూణేలోని కోరేగావ్ పార్క్ స్టోర్‌కి నెమలి థీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మన జాతీయ పక్షి అయిన నెమలి, గర్వానికి చిహ్నం. ఇది ఆపిల్ కొత్త స్టోర్‌లకు దేశీయతను తీసుకొస్తుంది.
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో..
పూణేలో ప్రారంభం కానున్న ఈ కొత్త స్టోర్ సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం. కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఆపిల్ ఈ స్టోర్లను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ కోసం ఆపిల్ ఆహ్వానాలు పంపే అవకాశం ఉంది.
ALSO READ: Google: 1.8 బిలియన్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసిన గూగుల్!
బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఉన్న మూడో స్టోర్ సెప్టెంబర్ 2న వినియోగదారుల కోసం తెరవబడుతుంది. ఆపిల్ ఇప్పుడు భారత్‌లో తన భౌతిక ఉనికిని పెంచుకోవడం ద్వారా ఇక్కడి మార్కెట్‌లో మరింత పట్టు సాధించాలని చూస్తోంది. ఇది దేశంలో ఆపిల్ అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.
ALSO READ: Google:ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆకస్మిక మార్పులు: గూగుల్ అప్‌డేట్‌పై సందేహాలు


