Monday, November 17, 2025
Homeబిజినెస్Apple: యాపిల్ సంస్థలో భారీ జీతాలు..!

Apple: యాపిల్ సంస్థలో భారీ జీతాలు..!

Apple Salaries: యాపిల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థలలో ఒకటిగా పేరుగాంచింది. అయితే ఇటీవల యాపిల్‌ సంస్థ అమెరికా ప్రభుత్వానికి ఇచ్చిన ఫెడరల్‌ ఫైలింగ్స్ ద్వారా ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

ఆపిల్‌ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్లు, డేటా సైన్టిస్టులు, ఏఐ/ఎంఎల్‌ నిపుణులకు కంపెనీ భారీ స్థాయిలో జీతాలు చెల్లిస్తోంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ (అప్లికేషన్స్): $1,32,267 – $3,78,700 (సుమారు రూ. 1.16 కోట్ల నుంచి రూ. 3.3 కోట్ల వరకు)
డేటా సైంటిస్ట్: $1,05,550 – $3,22,400 (సుమారు రూ. 92 లక్షల నుంచి రూ. 2.8 కోట్ల వరకు)
మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్: $1,43,100 – $3,12,200 (సుమారు రూ. 1.25 కోట్ల నుంచి రూ. 2.74 కోట్ల వరకు)
మెషీన్ లెర్నింగ్ రీసెర్చర్: $1,14,100 – $3,12,200 (సుమారు రూ.1 కోటి నుంచి రూ. 2.74 కోట్ల వరకు)
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్: $1,66,691 – $3,78,700 (సుమారు రూ. 1.4 కోట్ల నుంచి రూ. 3.33 కోట్ల వరకు)
హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైనర్: $1,35,400 – $4,68,500 (సుమారు రూ. 1.19 కోట్ల నుంచి రూ. 4.11 కోట్ల వరకు)
హార్డ్‌వేర్ సిస్టమ్స్ ఇంజినీర్: $1,25,495 – $3,78,700 (సుమారు రూ. 1.14 కోట్ల నుంచి రూ. 3.32 కోట్ల వరకు)
ఏఆర్/వీఆర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్: $1,29,805 – $3,12,200 (సుమారు రూ. 1.14 కోట్ల నుంచి రూ. 2.74 కోట్ల వరకు)
ఆర్​ఎఫ్​/అనలాగ్/మిక్స్‌డ్ సిగ్నల్ ఇంజినీర్: $1,31,352 – $3,12,200 (సుమారు రూ. 1.15 కోట్ల నుంచి రూ. 2.74 కోట్ల వరకు)
డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్: $1,03,164 – $3,12,200 (సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 2.74 కోట్ల వరకు)

Read more: https://teluguprabha.net/business/rbi-mpc-holds-repo-rate-unchanged-august-2025/

ఈ జీతాలు కేవలం బేస్ సాలరీ మాత్రమే. స్టాక్ ఆప్షన్లు, బోనస్‌లు కలిపితే మొత్తం ప్యాకేజీ మరింత ఎక్కువ అవుతుంది. ఆపిల్‌ సంస్థ ఏఐ/ఎంఎల్, సిలికాన్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఆఫీసుల్లో ఈ హై-ఎండ్ టెక్నికల్ ఉద్యోగాలకు అవసరమైన నిపుణులను నియమించుకుంటోంది.

Read more: https://teluguprabha.net/business/india-super-rich-investment-secret-bernstein-report/

యాపిల్‌ సంస్థ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలు చూస్తే, ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఉన్న పోటీ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ రంగాల్లో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే, యాపిల్ వంటి సంస్థల్లో కోటి రూపాయల జీతంతో ఉద్యోగం పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad