META: ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి నడుస్తుంది. ఇది ఒక కృత్రిమ యుగం అని చెప్పవచ్చు. ఆరోగ్య రంగం నుండి మొదలుకుని విద్య, వ్యాపారం, వినోదం.. ఇలా ప్రతి ఒక్క రంగంలో ఏఐ ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో, ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌పై ఉద్యోగుల అచంచలమైన విశ్వాసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
2025 ఫిబ్రవరిలో ఓపెన్‌ఏఐ మాజీ సిటీఓ మీరా మురాటీ స్థాపించిన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్వల్ప కాలానికే భారీ విశ్వాసాన్ని అందుకుంది. మురాటీ ప్రారంభించిన ఈ స్టార్టప్‌కు మెటా, మిస్ట్రాల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థల నుంచి వచ్చిన నిపుణుల బలమైన బృందమే వెన్నెముకగా నిలుస్తోంది. ఈ కంపెనీలోని 30 మంది ప్రముఖ ఏఐ నిపుణుల కోసం మెటా 200 మిలియన్ల డాలర్ల నుంచి ఏకంగా 1 బిలియన్ డాలర్ల (రూ.8700) వరకు ఆఫర్లు ఇచ్చినప్పటికీ.. వారిలో ఏ ఒక్కరూ కూడా ఆ కంపెనీని వదలలేదు.
ఇంతవరకూ మార్కెట్‌కు ఒక్క ఉత్పత్తి కూడా విడుదల చేయకముందే 12 బిలియన్ డాలర్ల విలువను సాధించిన ఈ స్టార్టప్‌ను ఉద్యోగులు ఎందుకు వదల్లేదనే విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం మీరా మురాటీపై ఉన్న విశ్వాసం. అల్బేనియాలో జన్మించిన మీరా, టెస్లా, లీప్ మోషన్, ఓపెన్ ఏఐ వంటి సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించిన అనుభవం కలిగి ఉంది. చాట్ జీపీటీ అభివృద్ధిలో కూడా ఆమె పాత్ర అమోఘమని చెప్పవచ్చు.
తన కలను నిజం చేసుకోవడానికి ఓపెన్ ఏఐను వీడి స్టార్టప్ ప్రారంభించిన మీరా.. ఇప్పుడు టెక్ రంగానికి ఒక నూతన మార్గదర్శిగా మారారు. నైపుణ్యం, నేతృత్వం, దృష్టి కలగలిపినప్పుడు ఏఐ స్టార్టప్‌లు ఎలా ప్రేరణగా మారతాయో థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ జీవింత సాక్ష్యం.


