Saturday, November 15, 2025
Homeబిజినెస్GST : పండగ జోష్‌కు 'జీఎస్టీ 2.0' బూస్ట్! అమ్మకాల జోరుకు సంస్కరణలే కారణం: నిర్మలా...

GST : పండగ జోష్‌కు ‘జీఎస్టీ 2.0’ బూస్ట్! అమ్మకాల జోరుకు సంస్కరణలే కారణం: నిర్మలా సీతారామన్

GST 2.0 reforms impact : దేశవ్యాప్తంగా పండగ శోభ వెల్లివిరుస్తోంది, మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పండగ జోష్‌కు, పెరిగిన అమ్మకాలకు ఇటీవలే తాము ప్రవేశపెట్టిన ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందుతున్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అసలు ఈ కొత్త సంస్కరణలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఏయే రంగాల్లో ఈ జోరు కనిపిస్తోంది?

- Advertisement -

కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్‌తో కలిసి శనివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ సంస్కరణల సానుకూల ప్రభావంపై మాట్లాడారు.

నవరాత్రులతో మొదలు: నవరాత్రి వేడుకల తొలిరోజు నుంచే జీఎస్టీ శ్లాబుల తగ్గింపు అమల్లోకి వచ్చిందని, దీనిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
పెరిగిన కొనుగోళ్లు: “జీఎస్టీ సంస్కరణల ఫలితంగా కొనుగోళ్లు పెరిగాయి. దీని ప్రయోజనాలు వినియోగదారులకు అందుతున్నాయి. కొన్ని సంస్థలైతే, జీఎస్టీ తగ్గింపు కంటే ఎక్కువ మొత్తంలో ధరలు తగ్గించి వినియోగదారులకు లాభం చేకూర్చాయి,” అని ఆమె అన్నారు.
ఫిర్యాదులపై స్పందన: జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా ధరలు తగ్గించని వ్యాపారులపై 3,169 ఫిర్యాదులు అందాయని, వాటిలో చాలావాటిని పరిష్కరిస్తున్నామని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నామని తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో దూకుడు: అశ్వినీ వైష్ణవ్
జీఎస్టీ సంస్కరణల వల్ల ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు పెడుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

అమ్మకాల జోరు: ఈ నవరాత్రి సమయంలో, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20-25% పెరిగాయి. కొన్ని విభాగాల్లో, ముఖ్యంగా 85 అంగుళాల టీవీల సెగ్మెంట్‌లో స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది.

ఉపాధి కల్పన: ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 25 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోందని, అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో భారత్ పొరుగు దేశాలను అధిగమించిందని తెలిపారు.

ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ: పీయూష్ గోయల్ :ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. “ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అందుకే భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా మన జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి పెంచింది,” అని ఆయన గుర్తుచేశారు.
ఈ సంస్కరణలు ‘వికసిత భారత్-2047’ లక్ష్య సాధనకు దోహదపడతాయని కేంద్ర మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad