Garudavega: ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అండ్ క్రాస్-బోర్డర్ షిప్పింగ్‌లో విశ్వసనీయమైన సంస్థ గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూఎస్ కు తన షిప్పింగ్ సేవలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 29 నుండి అమల్లోకి వచ్చిన డి మినిమిస్ రూల్ రద్దు తరువాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ అక్కడికి తన షిప్పింగ్ సేవలను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామంపై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మా కస్టమర్లందరికీ హామీ ఇస్తున్నాం. అమెరికాకి మా సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. కొత్త నిబంధనలు కొన్ని అదనపు అవసరాలను తీసుకువచ్చినా, గరుడవేగ వాటిని పూర్తిగా అనుసరిస్తోంది. కస్టమర్లందరికీ సహాయం అందించేందుకు మా సిబ్బంది, బ్రాంచ్ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. షిప్మెంట్ల ప్రాసెసింగ్ సాఫీగా సాగేందుకు వారందరికీ పూర్తి స్థాయి మార్గనిర్దేశం అందిస్తాము” అని తెలిపారు. “చట్టబద్ధంగా నడిచే సంస్థగా గరుడవేగ, అమెరికా కస్టమ్స్ నిబంధనలకు పూర్తిగా అనువెల్లడించారు. అంతేకాకుండా, కస్టమర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పార్సెల్‌లు పంపేటప్పుడు సవరించిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించాలని సూచించారు. కస్టమర్లు ఏవైనా సందేహాలు, మార్గదర్శకాలు లేదా వివరణల కోసం తమ సమీపంలోని బ్రాంచ్ లేదా సిబ్బంది ప్రతినిధులను సంప్రదించాలని వెల్లడించారు.
Read Also: Niharika: చీరతో కుర్రాలను కట్టిపడేస్తున్న మెగాడాటర్ నిహారిక!
ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్..
మరోవైపు, ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ అమెరికాకు తన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇటీవలే వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెం. 14324 నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ ప్రకారం ప్రకారం ఆగస్టు 29 నుంచి 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు ఇచ్చే కస్టమ్స్ పన్నుల మినహాయింపు రద్దు చేసింది. దీంతో అమెరికాకు పంపే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు, విలువతో సంబంధం లేకుండా, IEEPA టారిఫ్ ప్రకారం కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిందే. అయితే 100 డాలర్ల వరకు విలువైన బహుమతి వస్తువులపై మాత్రం సుంకాలు ఉండవు. ఈ కొత్త రూల్ వలన భారత పోస్టల్ శాఖ 100 డాలర్ల వరకు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను మినహాయించి, అన్ని పోస్టల్ సేవలను నిలిపివేస్తోంది. అమెరికా కొత్త కస్టమ్స్ విధానం వల్ల ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా అమెరికాకు పార్సెల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నిర్ణయం ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమెరికాకు జరిగే లో-వాల్యూ షిప్‌మెంట్లపై గణనీయమైన ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Gurpreet Singh: పోలీసుల కాల్పులకు ముందు సిక్కు యువకుడి విన్యాసాలు..!


