Gold Price Today:భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.అది సంపదకు, శ్రేయస్సుకు , పవిత్రతకు చిహ్నం. వివాహాలు, పండుగలు, శుభకార్యాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది తరతరాలకు వారసత్వంగా అందించే ఒక విలువైన ఆస్తిగా, ఆర్థిక భద్రతకు గట్టి పునాదిగా భావిస్తారు.పెళ్లిళ్లకు ముహూర్తాలు పెరిగి, బంగారానికి భారీగా డిమాండ్ పెరగడంతో నిన్నటి వరకు ఆకాశాన్ని అంటిన బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. గత పది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (సెప్టెంబర్ 5, 2025) 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గి రూ. 97,950కి చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 110 తగ్గి రూ. 1,06,860 గా ఉంది. గత 10 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 500 వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వెండి ఒక కిలో ధర రూ. 1,37,000గా స్థిరంగా కొనసాగుతోంది.
ధరలు తగ్గడానికి కారణాలు:
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవ్వడం, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే, ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనా లేదా రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా అనేది వేచి చూడాలి.


