Gold Price Today: ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రంప్ నిర్ణయాలపై పెరుగుతున్న ఆందోళనలు పసిడితో పాటు వెండి వంటి ఖరీదైన హోహాలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. దీంతో భారతీయ మధ్యతరగతికి తమ బడ్జెట్ కి మించి పెరిగిన రేట్లలో కొనలేక రేట్లు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే అయోమయంలో కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది అమెరికాకు చెందిన జేపీ మోర్గన్ రీసెర్చ్ ప్రకారం ఔన్సు గోల్డ్ రేటు 4వేల డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ప్రస్తుత ర్యాలీని చూస్తుంటే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.10,588 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర గ్రాముకు రూ.9,705 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కేజీకి నేడు రూ.1000 పెరిగిన తర్వాత రూ.లక్ష 36వేల వద్ద ఉంది.
24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే గ్రాముకు రూ.93 పెరిగింది . దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,588, ముంబైలో రూ.10,588, దిల్లీలో రూ.10,603, కలకత్తాలో రూ.10,588, బెంగళూరులో రూ.10,588, కేరళలో రూ.10,588, పూణేలో రూ.10,588, వడోదరలో రూ.10,588, బళ్లారిలో రూ.10,588, నోయిడాలో రూ.10,603, గురుగ్రాములో రూ.10,603 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే గ్రాముకు నేడు రూ.85 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9,705, ముంబైలో రూ.9,705, దిల్లీలో రూ.9,720, కలకత్తాలో రూ.9,705, బెంగళూరులో రూ.9,705, కేరళలో రూ.9,705, మంగళూరులో రూ.9,705, నాశిక్ లో బళ్లారిలో రూ.9,705, గురుగ్రాములో రూ.9,720గా ఉన్నాయి.


