Saturday, November 15, 2025
Homeబిజినెస్Gold Rate Rally: రెండు వారాల గరిష్ఠానికి గోల్డ్.. బంగారాన్ని ఆవరించిన డాలర్ బలహీనత ప్రభావం..!!

Gold Rate Rally: రెండు వారాల గరిష్ఠానికి గోల్డ్.. బంగారాన్ని ఆవరించిన డాలర్ బలహీనత ప్రభావం..!!

Gold Prices: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు వ్యవహారంపై పెరుగుతున్న అనిశ్చితి, బలహీనమైన డాలర్ మారకపు విలువ.. పెట్టుబడిదారులను సురక్షత ఆస్తులపై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ స్పాట్ మార్కెట్లో రెండు వారాల గరిష్ఠాలకు ఎగబాకాయి. ఆగస్టు 26న అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,371.28 డాలర్లకు చేరింది. ఆగస్టు 11 తర్వాత ఈ గరిష్టాన్ని తాకింది గోల్డ్. అమెరికా డిసెంబరు ఫ్యూచర్స్ ధర ఔన్స్‌కు 3,418.90 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. భారత మార్కెట్‌లో 24 క్యారట్ల బంగారం రేటు రూ.1.01 లక్ష / 10 గ్రాములకు, 22 క్యారట్ల గోల్డ్ రూ.93,040 / 10 గ్రాములు వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌ను “మార్ట్‌గేజ్ రుణాల లోపాల” కేసులతో తొలగించడం మార్కెట్లను కుదిపేసింది. ట్రంప్ చర్యలు యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ స్వతంత్రతపై అనుమానాలు పెరగడంతో డాలర్ సూచీ 0.2% వరకు పడిపోయింది. సాధారణంగా డాలర్ బలహీనపడితే విదేశీ పెట్టుబడిదారుల్లో బంగారంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అధికంగా కొనసాగుతున్న ధరల వద్ద పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఇటీవల గోల్డ్ రేటు తులం రూ. లక్ష మార్కును దాటిన తర్వాత మార్కెట్ సమీకరణ దశలో ఉందని IBJA వైస్ ప్రెసిడెంట్ అక్షా కాంబోజ్ అన్నారు. సెప్టెంబరులో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు కారణంగా ధరల్లో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారుల ఉత్సాహం ఇంకా బలంగా ఉందని తెలిపారు కాంబోర్. భారతదేశంలో పండుగల సీజన్ రావడం కూడా డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిర్ణయాలు ఈక్విటీలను దెబ్బతీయగా, బంగారంలో ఆశ్రయం పొందడానికి ఇన్వెస్టర్లు తమ డబ్బును మళ్లిస్తున్నట్లు అస్పెక్ట్ బులియన్ సీఈవో దర్శన్ దేశాయి అభిప్రాయపడ్డారు. తన అంచనాల ప్రకారం రేట్లు మరింతగా పెరుగుతాయని అన్నారు. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ సెప్టెంబరులో వడ్డీ రేట్ల కోతపై సంకేతాలు ఇచ్చినా.. ద్రవ్యోల్బణంపై జాగ్రత్త అవసరమని అన్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులకు లాభం కలుగుతుందని చెప్పుకొచ్చారు.

శుక్రవారం విడుదల అయ్యే PCE ధర సూచీపై మార్కెట్ల దృష్టి సారించింది. ఈ సూచీ ఫెడరల్ రిజర్వ్‌కు ముఖ్యమైన ద్రవ్యోల్బణ ప్రమాణం. టెక్నికల్స్ చూస్తే.. బంగారానికి స్పాట్ మార్కెట్లో $3,352–3,335 వద్ద మద్దతు, $3,395–3,410 వద్ద నిరోధం కనిపిస్తోందని వెల్లడైంది. ఇక భారత మార్కెట్‌లో కీలక స్థాయిలు రూ.1,00,240–99,850 మద్దతుగా, రూ.1,00,950–1,01,150 నిరోధంగా ఉంటాయని నిపుణులు చెప్పబడుతున్నాయి. మొత్తం మీద, మార్కెట్ బలహీనత చూపుతున్నప్పటికీ.. రాబోయే సెప్టెంబర్ 16–17 ఫెడ్ సమావేశంలో వడ్డీ కోత నిర్ణయంపై అటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో పాటు ఇటు బులియన్ మార్కెట్లు కూడా ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు, వాణిజ్య సుంకాల ప్రభావంతో పాటు ఇతర భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా కీలక పాత్ర పోషించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad