Gold Rate Today: ఒకపక్క కేంద్ర ప్రభుత్వం దేశంలో వినియోగం పెంచేందుకు జీఎస్టీ సంస్కరణల కింద పన్నుల తగ్గింపులను ప్రకటించిన క్రమంలో పసిడి ధరలు కూడా చల్లారాయి. దాదాపు వారం రోజులుగా నిరంతరం పెరిగిన గోల్డ్ ఇవాళ తగ్గటంతో చాలా మంది తెలుగు ప్రజలు షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వెండి రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా స్థబ్దుగా కొనసాగుతున్నాయి.
24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.11 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.10, 686 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,795 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి రూ.లక్ష 37వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.137 అన్నమాట.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.10,686, ముంబైలో రూ.10,686, దిల్లీలో రూ.10,701, కలకత్తాలో రూ.10,686, బెంగళూరులో రూ.10,686, కేరళలో రూ.10,686 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9,795, ముంబైలో రూ.9,795, దిల్లీలో రూ.9,810, కలకత్తాలో రూ.9,795, బెంగళూరులో రూ.9,795, కేరళలో రూ.9,795గా ఉన్నాయి.
బంగారం వెండి రేట్లను కొద్దిరోజులుగా.. అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలు పెంచినప్పటికీ ప్రస్తుతం అవి చల్లారుతున్నాయి. మరోపక్క అమెరికా ఇండియా మధ్య అనిశ్చితి కూడా మెల్లగా చల్లారటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతూ పసిడి, వెండికి డిమాండ్ తగ్గిస్తోంది. అయితే సెంట్రల్ బ్యాంకుల షాపింగ్, ఇన్వెస్టర్ల స్టాకింగ్, గ్లోబల్ జియో పొలిటికల్ ఆందోళనలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.


