Gold Rates Today: బంగారం ధరలు ఇప్పుడు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. సెప్టెంబర్ 8న దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,08,480కి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 99,440కి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం డిమాండ్ పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,610కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,590గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,480గా, 22 క్యారెట్ల ధర రూ. 99,440గా నమోదైంది. వడోదరలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,510 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 99,490గా ఉంది.
వెండి ధరలు
బంగారంతో పోలిస్తే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,37,900గా ఉంది. కాగా, ఢిల్లీ, కోల్‌కతా, కేరళ, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,27,900గా నమోదైంది. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండకపోవచ్చు. వాటి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, ఆయా నగరాల్లోని బంగారం మార్కెట్‌ను సంప్రదించి ధరలను నిర్ధారించుకోవడం ఉత్తమం. ఆర్థిక నిపుణుల సూచనల మేరకు బంగారం, వెండి మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిది.


