Sunday, November 16, 2025
Homeబిజినెస్Group Insurance: ఉద్యోగులకు దక్కని ఊరట.. గ్రూప్ ఇన్సూరెన్స్ పై 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే..!

Group Insurance: ఉద్యోగులకు దక్కని ఊరట.. గ్రూప్ ఇన్సూరెన్స్ పై 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే..!

GST on Insurance: గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ 18 శాతం యథావిధిగా కొనసాగించడం వల్ల ఉద్యోగులు ఊరట పొందలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇన్సూరెన్స్ రంగంలో జీఎస్టీ సడలింపుల నిర్ణయం తీసుకున్నా, దాని ప్రయోజనం మాత్రం కేవలం వ్యక్తిగత పాలసీలకే పరిమితమైంది. కలెక్టివ్‌గా కంపెనీలు తీసుకునే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీములకు వస్తు సేవల పన్ను రేటు తగ్గకపోవడంతో, ఉద్యోగులు వాస్తవంగా ఎలాంటి ఆర్థిక లాభం పొందని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

ఉద్యోగులకు మెడికల్ సేఫ్టీ కల్పించేందుకు అనేక సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటాయి. వీటి ద్వారా వారందరికీ ఒకే అంబ్రెలా కింద వైద్య భద్రత లభిస్తుంది. కానీ ఈ ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుండటం వల్ల కంపెనీలపై అదనపు భారంగా మారుతుంది. ఫలితంగా ఈ ఖర్చును నేరుగా లేదా పరోక్షంగా ఉద్యోగులపైనే మోపుతున్నారు. ఆశించినట్లుగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా సడలింపు లభిస్తే, ఎన్నో కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి కొంత వరకు ఉపశమనాన్ని పొందేవి.

మరోవైపు వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీలకే జీఎస్టీ తగ్గింపు వర్తింపజేయడం వల్ల, ఒంటరిగా పాలసీ కొనుగోలు చేసి ప్రీమియం చెల్లించే వారికి మాత్రం కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత పాలసీల ప్రీమియం భారాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రూప్ ప్రీమియం చెల్లింపులే ఎక్కువ మొత్తంలో ఉన్నందున గ్రూప్ ఇన్సూరెన్స్‌పై కూడా సడలింపు ఉంటే ఉద్యోగులకు పెద్ద ఊరట లభించేదని ఉద్యోగ యూనియన్లు అంటున్నాయి.

ఇప్పటికే వైద్య ఖర్చులు పెరిగి మధ్య తరగతి, ఉద్యోగ వర్గంపై గణనీయమైన భారం పడుతోంది. ఉద్యోగులు ఆధారపడే ప్రధాన రక్షణ గ్రూప్ మెడికల్ పాలసీలే కావడంతో.. వీటిపై జీఎస్టీ తగ్గింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యక్తిగత పాలసీదారులకు లాభాన్నివగా.. వేతనజీవులకు మాత్రం నిరాశను మిగిల్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad