Saturday, November 15, 2025
Homeబిజినెస్Honda 25 years Edition Bikes: హోండా సిల్వర్‌ జూబ్లీ టూవీలర్స్‌ విడుదల.. ఈ స్పెషల్‌...

Honda 25 years Edition Bikes: హోండా సిల్వర్‌ జూబ్లీ టూవీలర్స్‌ విడుదల.. ఈ స్పెషల్‌ ఎడిషన్స్‌ లుక్‌ చాలా డిఫరెంట్‌ గురూ!

Honda Special Edition Bikes: హోండా టూవీలర్స్‌ ఇండియా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ కస్టమర్లకు కోసం ప్రత్యేక ఎడిషన్స్‌ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా యాక్టివా 110 (Honda Activa 100), యాక్టివా 125 (Activa 125), ఎస్పీ 125 (SP 125) స్పెషల్‌ ఎడిషన్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఎడిషన్‌ వెహికిల్స్‌ ఆగస్టు వరకు కొనుగోలుకి అందుబాటులో ఉండనున్నాయి. కేవలం హోండా అధీకృత డీలర్‌షిప్స్‌లో మాత్రమే ఈ ఎడిషన్స్ అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

అగ్రగామి: హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హోండా 1998లో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2001లో హోండా హీరోతో తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం హోండా టూవీలర్‌ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. స్కూటర్ల విభాగంలో ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న హోండా యాక్టివా నంబర్‌ 1గా కొనసాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా హోండా యాక్టివాకి గట్టి పోటీని ఇచ్చే స్కూటర్లు రాలేదు. ఈ మార్కెట్‌ని హోండా శాసిస్తోంది. దీంతో పాటు బడ్జెట్‌లో లభిస్తున్న హోండా షైన్‌ 125సీసీ విభాగంలో దూసుకెళ్తోంది. ఇంకా ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ సంస్థకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

సరికొత్త లుక్‌లో: 25 సంవత్సరాల ఎడిషన్ మోడల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెహికిల్స్‌తో పోలిస్తే డిఫరెంట్‌ లుక్‌ని కలిగి ఉండనున్నాయి. స్కూటర్లలో యాక్టివా 110, యాక్టివా 125 బాడీ ప్యానెల్స్‌పై ప్రత్యేకమైన యానివర్సరీ గ్రాఫిక్స్, ఫ్రంట్ అప్రాన్‌లో 25 సంవత్సరాల వార్షికోత్సవ లోగోతో షార్ప్‌ బ్లాక్ క్రోమ్ ఫినిష్ కలదు. వీటితో పాటు అల్లాయ్ వీల్స్ పైరైట్ బ్రౌన్ మెటాలిక్ కలర్‌లో అందించారు. యాక్టివా 110లో సీట్లు, లోపలి ప్యానెల్స్ కేఫ్-బ్రౌన్, బ్లాక్‌ కలర్‌ కాంబినేషన్‌తో ఇచ్చారు. యాక్టివా 125లో బ్లాక్ ఫినిష్‌ లుక్‌ అందించారు.

ఎస్పీ 125 యానివర్సరీ ఎడిషన్‌లో స్పెషల్‌ యానివర్సరీ గ్రాఫిక్స్, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పెషల్‌ లోగో, పైరైట్ బ్రౌన్ మెటాలిక్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్‌ కలర్ యాక్సెంట్స్ కలవు. ఈ బైక్‌ పర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్లు: ఫుల్‌ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, 4.2 అంగుళాల TFT డిస్ప్లే, USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ కలవు. యాక్టివా 110 స్కూటర్‌ 109.51 సీసీ సింగిల్ సిలిండర్ PGM-Fi OBD2B కంప్లైంట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇక యాక్టివా 125లో 123.92 సీసీ ఇంజిన్‌ కలదు. ఎస్పీ 125 బైక్‌ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ PGM-Fi OBD2Bతో నడుస్తుంది. ఈ మూడు మోడళ్లలోనూ హోండా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

స్పెషల్‌ ఎడిషన్‌ ధరలు: 25 సంవత్సరాల స్పెషల్‌ ఎడిషన్‌ హోండా యాక్టివా 110 ఎడిషన్ ధర రూ .92,565, యాక్టివా 125 ఎడిషన్ ధర రూ .97,270, ఎస్పీ 125 ఎడిషన్ ధర రూ .1,02,516 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad