Saturday, November 15, 2025
Homeబిజినెస్Market Fall: వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే మార్కెట్లు.. విదేశీ ఇన్వెస్టర్లు హ్యాండ్ ఇవ్వటంతో ఆందోళనలు..

Market Fall: వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే మార్కెట్లు.. విదేశీ ఇన్వెస్టర్లు హ్యాండ్ ఇవ్వటంతో ఆందోళనలు..

Market Negative Closing: ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు పతనంలో కొనసాగాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 297 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్ల నష్టాలతో నేడు ట్రేడింగ్ ముగించాయి. క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 82,029.98 వద్ద, నిఫ్టీ 25,145.50 వద్ద నిలిచాయి. ఈ తగ్గుదలకు ముఖ్యకారకాలు విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వంటివి ఉన్నాయి.

- Advertisement -

మార్కెట్ల ముగింపు సమయానికి టాటా మోటార్స్, విప్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ట్రెంట్, టీసీఎస్ వంటి కంపెనీలు లూజర్స్‌గా ఉన్నాయి. ఈ మార్కెట్ పరిస్థితులను మోటిలాల్ ఓస్వాల్, కోటక్ సెక్యూరిటీస్ సహా ఇతర విశ్లేషకులు రిస్క్ అవేరెన్స్ పెరిగిందని, మార్కెట్ రేంజ్ బౌండ్ కాబోతుందని, త్రైమాసిక ఫలితాల రిపోర్టులు, ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై ఆధారపడి జరుగుతుందని భావిస్తున్నారు.

ప్రధానంగా విదేశీ మదుపరులు దాదాపు రూ.240 కోట్ల విలువైన పెట్టుబడును అమ్మేయటంతో కొంత ఒత్తిడి మెుదలైంది. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకం దారులుగా మారిపోయారు. ఇండియా విక్స్ సూచీ పెరగటంతో అనిశ్చితి భయాలు పెరగటం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, డాలర్ తో పోల్చితే రూపాయి మారకపు విలువ 9 పైసలు తగ్గి రూ.88.79కి చేరుకోవటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల వంటి అంశాలు మార్కెట్లను ప్రతికూలంగా నడిపిస్తున్నాయి.

నేడు మార్కెట్లో ఓలటాలిటీ కారణంగా ఫార్మా, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లలో ప్రభావం కనిపించింది. మెుత్తానికి పెట్టుబడిదారులు కొంత అప్రమత్తతను కలిగి ఉండాల్సిన సమయంగా విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ​

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad