Sunday, November 16, 2025
Homeబిజినెస్Jio Finance: దీపావళి పండుగ వేళ జియో ఫైనాన్స్‌ బంపరాఫర్‌.. డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోళ్లపై భారీ...

Jio Finance: దీపావళి పండుగ వేళ జియో ఫైనాన్స్‌ బంపరాఫర్‌.. డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్‌..!

Jio Finance is offering free gold and chance to win prizes: దసరా, దీపావళి పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు కొనుగోలుదారులతో షాపింగ్‌ మాల్స్‌ కళకళలాడుతుంటాయి. అటు, షాపింగ్‌ మాల్స్‌, ఈ-కామర్స్‌ సైట్లు కూడా బంపరాఫర్లు ప్రకటిస్తుంటాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జియోఫైనాన్స్ డిజిటల్ బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో భారీ డిస్కౌంట్‌పై దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌ కింద మీరు కేవలం రూ. 2 వేలకే బంగారం కొనుగోలు చేయవచ్చు. అలాగే, 2% అదనపు బంగారం పూర్తి ఉచితంగా పొందవచ్చు. అదనంగా రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ.10 లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులు అక్టోబర్ 18 నుండి 23 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ధంతేరాస్, దీపావళి వంటి శుభ సందర్భాల్లో మీరు మీ ఇంటి నుండే డిజిటల్‌గా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 18 నుండి 23, 2025 వరకు జియో ఫైనాన్స్‌, మైజియో యాప్‌ల ద్వారా రూ.2 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు 2% అదనపు బంగారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఉచిత బంగారం 72 గంటల్లోపు వారి గోల్డ్‌ వాలెట్‌లో ఆటోమేటిక్‌గా యాడ్‌ అవుతుంది. అంటే, మీ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు. వరుసలో నిలబడాల్సిన అవసరం లేకుండా లేదా జ్యువెలరీ షాప్‌కు వెళ్లాల్సిన పని లేకుండా సులభంగా ఆఫర్‌లో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

రూ.10 లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం..

రూ.20 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కొనుగోలు చేసే కస్టమర్లు ఆటోమేటిక్‌గా జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. డ్రాలో ఎంపికైన వారికి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, బంగారు నాణేలు, మిక్సర్ గ్రైండర్లు, గిఫ్ట్ వోచర్లు వంటి అనేక ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తారు. విజేతలను ఫెయిర్ డ్రా ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. వారి పేర్లను అక్టోబర్ 27, 2025న ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ప్రకటిస్తారు. డిస్కౌంట్‌ ధరలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి, అదనంగా బహుమతులు గెలుచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. కాగా, జియో గోల్డ్ అనేది 100% డిజిటల్, సురక్షితమైన, యూజర్ ఫ్రెండ్లీ పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. జియో గోల్డ్‌లో మీరు మీ బంగారం పొదుపును కేవలం రూ.10 నుండి ప్రారంభించవచ్చు. దీన్ని స్టోరేజీ చేసుకోవడం, రీడీమ్ చేసుకోవడం చాలా సులభం. అంతేకాదు, పండుగల సమయంలో సాంప్రదాయ బంగారం కొనుగోలుకు బదులు డిజిటల్‌ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడంతో అనేక లాభాలున్నాయి. మీరు మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలన్నా? లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వాలన్నా? జియో గోల్డ్ ఒక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad