ITR Filing Late: ఐటీఆర్ ఫైల్ చేసేవారికి హెచ్చరిక. రేపే ఆఖరి రోజు. ఇప్పటికే పన్ను అధికారులు కొన్ని టెక్నికల్ కారణాలతో గడువును పెంచగా.. మరోసారి పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి ఉపశమనం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15న ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) ఫైల్ చేయటం పూర్తి చేయాలి. ఈ గడువు మించిన తర్వాత పన్ను చట్టం ప్రకారం వేర్వేరు జరిమానాలు, చర్యలు విధించబడతాయి. పన్ను ఫైలింగ్ డెడ్ లైన్ మిస్ అయితే ఎలాంటి చర్యలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Vahana Mitra : ఇవి ఉంటేనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర సాయం
లేటు ఫైలింగ్ ఫీజు: గడువు ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే పన్ను శాఖ లేట్ ఫైలింగ్ ఫీ విధిస్తుంది. ఇది సాధారణంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉండవచ్చు. కానీ నిర్ధిష్ట పరిస్థితులలో తగ్గించాలని అనుమతించే సందర్భాలు కూడా ఉంటాయి.
బ్యాంకు ఖాతాలపై పరిమితులు: బ్యాంకు ఖాతాలు ఇతర ఉపయోగాల కోసం పరిమితంగా ఉంటాయి. పెద్ద రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందటం కష్టమవుతుంది.
పెనాల్టీతో పాటు వడ్డీ వసూలు: పన్ను రిటర్న్ ఆలస్యం వల్ల పెనాల్టీలు, చెల్లింపులు ఆలస్యమైన రోజులకు కట్టాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆదాయపు పన్ను రికవరీకి అవకాశం కల్పిస్తుంది.
పన్ను రిపోర్టింగ్ లో ఇబ్బందులు: పన్ను రిటర్న్స్ ఆలస్యం వల్ల అన్ని రకాల పన్ను ప్రయోజనాలు, డిడక్షన్లు పొందటం కష్టం అవుతుంది. రిటర్న్ ఆలస్యం వలన పన్ను రీఫండ్ కూడా ఆలస్యమవుతుంది.
అందుకే పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన వ్యక్తులు సెప్టెంబర్ 15 గడువులోపు ITR ఫైల్ చేయటం చాలా అవసరం. డెడ్ లైన్ మిస్ అయితే జరిమానాలు తప్పవు.


