Sunday, November 16, 2025
Homeబిజినెస్Markets Fall: 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఈక్విటీ మార్కెట్ నష్టాలకు అసలు కారణాలివే..

Markets Fall: 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఈక్విటీ మార్కెట్ నష్టాలకు అసలు కారణాలివే..

Market Mood: ఇండియా స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీ ఒడిదుడుకులు చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమై ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 120కి పైగా పాయింట్లు పడిపోయింది. ఈ పతనానికి గల ప్రధాన కారణాల్లో అమెరికా ప్రభుత్వం తీసుకున్న H-1B వీసా ఫీజు పెంపు, విదేశీ మార్కెట్లలో ప్రతికూలతలు, భారత IT రంగం షేర్లలో భారీ అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు ఉన్నాయి.

- Advertisement -

మార్కెట్ పతనానికి దోరబదపడ్డ కారణాలను గమనిస్తే..
* అమెరికా పాలసీలు వీసా సమస్య: US అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసా ఫీజును పెంచటంతో IT రంగ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
* గ్లోబల్ మార్కెట్ ప్రభావం: ఫెడరల్ రిజర్వ్ అధిపతి జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లపై ఇచ్చిన కామెంట్స్, US మార్కెట్‌లో టెక్ షేర్లు పతనం, ఆసియా మార్కెట్లలో నెగటివ్ ట్రెండ్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
* విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు: FPIలు రూ.3,551 కోట్ల విలువైన భారతీయ షేర్లను అమ్మారు. దీనివల్ల మార్కెట్లో ఒత్తిడి పెరిగింది.
* ప్రాఫిట్ బుకింగ్: గత మూడు వారాల్లో మార్కెట్ 1,000 పాయింట్ల ర్యాలీని చూశాక.. ప్రస్తుత అనిశ్చితుల దృష్ట్యా ట్రేడర్లు లాభాలను నిలబెట్టుకునేందుకు ఫ్రాఫిట్ బుక్కింగ్ కి వెళ్లటం అమ్మకాల ఒత్తిడిని పెంచేస్తోంది.
* రూపాయి బలహీనత: డాలర్ తో పోల్చితే రూపాయి మారకపు విలువ మరింత బలహీనపడడం విదేశీ పెట్టుబడిదారుల మూడ్ ను ప్రభావితం చేసింది.
* వివిధ రంగాల్లో ఒత్తిడి: ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా, FMCG రంగాల్లో అమ్మకాల ఒత్తిడితి చిత్తయ్యాయి. కానీ PSU బ్యాంక్స్ మాత్రం లాభపడ్డాయి.

మార్కెట్లపై నిపుణుల కామెంట్స్..
మార్కెట్ నిపుణులు లాభాలు పదిలపర్చుకోవడం, US వీసా ఫీజు నిర్ణయం, IT రంగంలో మౌలికంగా వస్తున్న మార్పులు, గ్లోబల్ ఫాక్టర్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నారు.

ట్రేడర్లకు సూచనలు..
తక్కువ స్థాయిలలో కొనుగోలు చేయాలని, టెక్నికల్స్ ఫాలో అవుతూ స్టాప్‌లాస్ పాటించాలని నిపుణులు సూచిస్తు్న్నారు. మార్కెట్ ఇప్పటికీ దీర్ఘకాలికంగా బలోపేతంగా ఉన్న నేపథ్యంలో, ఈ పతనం టాక్టికల్ బయ్యింగ్ అంటే కొత్త కొనుగోళ్లకు అవకాశాన్ని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad