e Vitara:జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి రాబోయే 5-6 ఏళ్లలో భారతదేశంలో రూ.70,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రతినిధి డైరెక్టర్, అధ్యక్షుడు తోషిహిరో సుజుకి వెల్లడించారు. తాము 4 దశాబ్ధాలుగా భారతదేశంలో వ్యాపారాన్ని చేస్తున్నామని చెప్పిన తోషిహిరో భారత ప్రభుత్వం నెట్ జీరో కర్భన ఉద్ఘార లక్ష్యాలను చేరుకోవటంలో సహకరిస్తామని చెప్పారు. అలాగే గుజరాత్‌లోని కంపెనీ సౌకర్యం త్వరలో 10 లక్షల కారు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారనుందని చెప్పారు.
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఇవిటారా (e Vitara)’ ను గుజరాత్ హన్సల్పూర్ ప్లాంట్లో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV సెప్టెంబర్ 3న భారత్ మార్కెట్లో విడుదలకానుంది. వాస్తవాని మారుతీ సుజుకీ తయారు చేసిన తొలి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ కారును100 దేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ విటారా కారుకు 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్కసారి చార్జ్ చేసుకున్నప్పుడు సుమారు 426 నుండి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. కారు 7 కిలో వాట్ AC ఛార్జింగ్, 70 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పవర్ అప్‌ఔట్‌పుట్ 144 PS నుండి 172 PS వరకూ ఉంటుంది.
గ్లాస్ బ్లాక్ గ్రిల్, ఫ్లార్డ్ ఫీండర్లు, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ ముఖ్య ఆకర్షణలు. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్స్, మ్యల్టీ-కలర్ అంబియంట్ లైటింగ్, ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లను కంపెనీ ఈ కారులో అందిస్తోంది. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఇవితారాలో ఉన్నాయి.
కారు ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ధర రూ. 20 లక్షల నుంచి స్టార్ట్ అవ్వొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం భారత మార్కెట్లో హుందాయ్ క్రెటా ఈవీ, Mahindra BE 6, MG ZS EV వంటి మోడల్స్‌తో పోటీ పోటీపడనుంది.


