Income Tax Bill: పార్లమెంటులో తాజాగా ఆమోదించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేయనుంది. ఇది 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ leaner & focused చట్టం చదవటానికి, అర్థం చేసుకోవడానికి, అమలు చేయడం కోసం సులభంగా రూపొందించబడింది.
ఈ బిల్లులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాత చట్టంలోని 819 సెక్షన్లను 536కి, అధ్యాయాలను 47 నుండి 23కి తగ్గించారు. పదాల సంఖ్యను సగానికి తగ్గిస్తూ, 5.12 లక్షల పదాల నుండి 2.6 లక్షలకు పరిమితం చేశారు. కాన్సెషనల్ ట్యాక్స్ రేట్లు ఉపయోగించే కంపెనీలకు డివిడెండ్ డిడక్షన్‌లో ఉన్న పొరపాట్లను సరిదిద్దారు. పరిమిత బాధ్యత భాగస్వామ్యాల (LLP)లపై ప్రత్యామ్నాయ కనీస పన్ను(AMT) వర్తింపు మరొక ముఖ్యమైన సవరణగా నిలిచింది. కొన్ని ట్యాక్స్ ప్రయోజనాలు పొందని LLPలపై మినహాయింపు వర్తించదన్న ముందటి అభిప్రాయాన్ని తొలగించారు.
Read more: https://teluguprabha.net/business/gold-and-silver-prices-decrease-again-second-day-after-a-week/
బిల్లు యొక్క ప్రారంభ ముసాయిదాలో ఆన్ టైం ఫైలింగ్ చేసే వారికి మాత్రమే రిఫండ్ ఇవ్వాలన్న నిబంధనను తాజాగా తొలగించారు. ఇది ఆలస్యంగా ఫైల్ చేసే వారికి ఉపశమనం కలిగిస్తుంది. విద్యార్థుల కోసం బ్యాంకులు ద్వారా ఇచ్చే విద్యా రిమిటెన్సులకు టీసీఎస్ వర్తించదని తాజాగా స్పష్టత ఇచ్చారు. “వర్చువల్ డిజిటల్ స్పేస్” అనే నిర్వచనం ఈ బిల్లులో మారలేదు. ఆదాయపు పన్ను అధికారులు సర్వే, సోదాల్లో సోషల్ మీడియా, ఇమెయిల్ వంటి డిజిటల్ డేటాను యాక్సెస్ చేయగలరు. అయితే, వ్యక్తిగత డేటా వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read more: https://teluguprabha.net/business/motilal-oswal-financial-services-invests-rs-400-crore-in-zepto/
NPSపై ఉన్న ట్యాక్స్ మినహాయింపులను యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి విస్తరించారు. సౌదీ అరేబియాలోని పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ కి ఇండియాలోని పెట్టుబడులపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, లాస్ ఫార్వార్డింగ్‌పై స్పష్టత ఇచ్చారు. ఈ కొత్త చట్టం పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే దిశగా ముందడుగు వేసింది.


