Oben Rorr: ఎలక్ట్రిక్ వాహనం అనగానే మనకు కేవలం నిదానంగా వెళ్లే స్కూటర్లే గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఆ దృశ్యం మారింది ఇంధన ధరల పెరుగుదల, కాలుష్యం కారణంగా దేశంలో ఈవీల వాడకం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, హై-స్పీడ్, లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ మార్కెట్‌లోకి దూసుకొచ్చాయి. రైడింగ్‌లో థ్రిల్‌ను కోరుకునే యువత కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్. ఈ కంపెనీ స్పోర్ట్స్ బైక్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారించి, అద్భుతమైన మోడళ్లను పరిచయం చేసింది. స్పోర్ట్స్ బైక్స్‌లో ఉండే ప్రత్యేకమైన డిజైన్‌ను, పవర్‌ను కోరుకునే వారికి ఒబెన్ బైక్స్ గొప్ప ఎంపిక.
ఒబెన్ రోర్: పవర్, రేంజ్, స్టైల్ మేళవింపు
ఒబెన్ ఎలక్ట్రిక్ పరిచయం చేసిన బైక్స్‌లో రోర్ EZ-3, రోర్ EZ-4, రోర్ సిగ్మా వంటి మోడల్స్ ఉన్నాయి. ఇవి 3.4kW నుండి 4.4kW వరకు మల్టిపుల్ వేరియంట్‌లలో లభిస్తున్నాయి. వీటి అతిపెద్ద ఆకర్షణ ఏంటంటే – ఇవి సింగిల్ ఛార్జ్‌పై 150 కి.మీ నుండి 180 కి.మీ వరకు అద్భుతమైన రేంజ్‌ను అందిస్తాయి.ఈ బైక్స్‌లో మీకు నచ్చిన రైడింగ్ స్టైల్‌ను ఎంచుకోవడానికి వీలుగా మూడు రకాల మోడ్‌లు ఉన్నాయి.
ఎకో మోడ్ (Eco Mode): రోజువారీ ప్రయాణాలకు అనువైనది. 40 కి.మీ/గం వేగంతో ఏకంగా 150 కి.మీ రేంజ్.
సిటీ మోడ్ (City Mode): నగర ట్రాఫిక్‌లో వేగంగా వెళ్లడానికి. 60 కి.మీ/గం వేగంతో 110 కి.మీ రేంజ్.
హావోక్ మోడ్ (Havoc Mode): పవర్ మరియు వేగాన్ని ఇష్టపడే రైడర్‌ల కోసం. 95 కి.మీ/గం గరిష్ట వేగంతో 90 కి.మీ దూరం.
అత్యాధునిక ఫీచర్లు
ఒబెన్ స్పోర్ట్స్ బైక్స్ కేవలం వేగంతోనే కాదు, స్మార్ట్ ఫీచర్లతోనూ రైడర్‌లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్ డిస్‌ప్లే, కాల్/టెక్స్ట్ అలర్ట్స్, నావిగేషన్ అసిస్టెన్స్, ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ మరియు రివర్స్ మోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్స్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌తో ఈ బైక్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. మార్కెట్‌లో ఈ స్పోర్ట్స్ బైక్స్ ధరలు రూ. 1,36,297 నుంచి ప్రారంభమవుతున్నాయి. పెట్రోల్ బైక్ పవర్‌ను, ఎలక్ట్రిక్ బైక్ పొదుపును కోరుకునే వారికి ఒబెన్ ఎలక్ట్రిక్ బైక్స్ ఒక అద్భుతమైన ఛాయిస్.


