Reliance Jio 189 Plan: ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ధర జస్ట్ రూ.189 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్ లో కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాల్స్, 2GB హైస్పీడ్ డేటా, 300 SMSలు ఉచితం అందిస్తోంది జియో. తక్కువ ఖర్చుతో మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి ఇదొక సరైన రీఛార్జ్ ప్లాన్.
ఈ ఆఫర్ లో జియో కేవలం కాల్స్, డేటా మాత్రమే కాకుండా.. జియో టీవీ చూసే అవకాశం, అలాగే జియో AI క్లౌడ్ ద్వారా డిజిటల్ స్టోరేజ్ సదుపాయం కూడా కల్పిస్తోంది. అందువల్ల ఇది కాల్స్ వినియోగం ఎక్కువగా చేసేవారితో పాటు తక్కువ డేటా ఉపయోగించే వారికి కూడా లాభదాయకంగా ఉండనుంది. ముఖ్యంగా రెండో సిమ్ ఉంచుకునే వినియోగదారులకి ఇదొక కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
AP liquor scam: వైసీపీ నేతలకు బ్యాడ్ న్యూస్
మరో వైపు జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్ కూడా రూ.199 రేటుకే ఇలాంటి ప్లాన్ అందిస్తోంది తన కస్టమర్లకు. ఇందులో కూడా 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, 2GB డేటా, 300 SMSలు, ఫ్రీ నేషనల్ రోమింగ్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఎయిర్ టెల్ వినియోగదారులకు రూ.17వేలు విలువైన Perplexity AI సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేయబడుతోంది. ఇది ప్రత్యేకంగా డిజిటల్ టూల్స్ వినియోగించుకునే వారికి ఉపయోగకరం.
మొత్తానికి జియో రూ.189 ప్లాన్ తక్కువ ఖర్చుతో బేసిక్ అవసరాలను తీర్చడానికి సరైనదిగా ఉండగా.. ఎయిర్ టెల్ రూ.199 ప్యాక్ మాత్రం AI సేవలు అవసరమైన వారికి బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. రెండు ప్లాన్లు కూడా బ్యాకప్ సిమ్ లేదా తక్కువగా మెుబైల్ వాడే వినియోగం కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్.


