Sunday, November 16, 2025
Homeబిజినెస్Renault Kiger Facelift Vs Toyota Taisor: రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ లేదా టయోటా టైసర్.....

Renault Kiger Facelift Vs Toyota Taisor: రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ లేదా టయోటా టైసర్.. ధర, ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ ఎస్‌యూవీ బెస్ట్..?

SUVs: ఇండియాలో రోజురోజుకు వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక కార్ల తయారీ కంపెనీ కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే, ఇండియాలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అత్యంత డిమాండ్ ఉంది. అన్ని కార్ల తయారీదారులు ఈ విభాగంలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. రెనాల్ట్ ఇటీవల ఈ విభాగంలో కిగర్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎస్‌యూవీ టయోటా టైసర్‌తో నేరుగా పోటీ పడుతోంది. ఇంజిన్, ఫీచర్లు, మైలేజ్, ధర పరంగా రెండు ఎస్‌యూవీలలో కొనడానికి ఏది మంచి ఎంపిక అవుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్సెస్ టయోటా టైజర్ ధర:

ఈ రెండు కార్ల ధర విషయానికి వస్తే..రెనాల్ట్ ఇండియాలో కిగర్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ.5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. దీని టాప్ వేరియంట్ ధర రూ.10.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మరోవైపు.. టయోటా ఇండియాలో టైసర్‌ను రూ.7.21 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంది.

also read:Amla Benefits: చలికాలంలో ఉసిరికాయ తింటే ఆ సమస్యలే దరిచేరవు..!!

 

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్సెస్ టయోటా టైసర్ ఇంజిన్:

ఇంజిన్ గురించి మాట్లాడితే.. రెనాల్ట్ కిగర్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 72 PS, 100 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే టర్బోచార్జ్డ్ ఇంజిన్ 96 PS, 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్, ఏఎంటీ, సివిటి ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందించారు. అలాగే, టయోటా టైజర్ ఇంజిన్ విషయానికి వస్తే..ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, సిఎన్‌జి, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా వస్తుంది. ఇవి మాన్యువల్, ఏఎంటీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందించారు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 66 kW పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే టర్బోచార్జ్డ్ ఇంజన్ 73.6 kW పవర్, 147.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 19.86 నుండి 22.79 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి.

 

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టయోటా టైసర్ ఫీచర్లు:

రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కిగర్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌కు అనేక అద్భుతమైన ఫీచర్లు అందించింది. ఈ కారు LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ ల్యాంప్‌లు, LED టెయిల్‌లైట్లు, బ్లాక్ రూఫ్ రెయిల్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, టర్బో వేరియంట్‌లో రెడ్ బ్రేక్ కాలిపర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా ఈ కారు డ్యూయల్ టోన్ ఇంటీరియర్, స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, యాంబియంట్ లైట్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్, 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, TPMS, వంటి మరెన్నో ఫీచర్లతో వస్తుంది.

మరోవైపు టయోటా టిగోర్ ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఈ కారు LED హెడ్‌లైట్‌లు, LED DRLలు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్‌లు, వెనుక వైపర్, స్కిడ్ ప్లేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాబ్రిక్ సీట్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMల వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వెనుక AC వెంట్స్, ఫుట్‌వెల్ ఇల్యూమినేషన్, 22.86 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్కిమిస్ ఆడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వంటి మరెన్నో ఫీచర్లతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad