Sunday, November 16, 2025
HomeTop StoriesF&O Trading: అక్టోబర్ 1 నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కొత్త రూల్స్.. తెలుసుకోండి...

F&O Trading: అక్టోబర్ 1 నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కొత్త రూల్స్.. తెలుసుకోండి ఇన్వెస్టర్స్..

F&O New Rules: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే F&O (ఫ్యూచర్స్ & ఆప్షన్స్) రంగంలో అక్టోబర్ 1, 2025 నుండి కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఈ నియమాలతో మార్కెట్‌ను మరింత సురక్షితంగా, స్థిరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

సెబీ తీసుకొచ్చిన ముఖ్య మార్పుల వివరాలు..
1. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ (MWPL):
మునుపటి షేర్ల హోల్డింగ్ ఆధారంగా లెక్కించే MWPLను ఇప్పుడు క్యాష్ వాల్యూమ్, ఫ్రీ ఫ్లోట్ ఆధారంగా లెక్కిస్తారు. ఇది ఎక్కువగా కొనసాగుతున్న మార్కెట్ మానిప్యులేషన్‌ను అరికట్టడంలో సహాయపడుతుంది.

2. బ్యాన్ పీరియడ్‌లో ట్రేడింగ్:
పాత నియమాల ప్రకారం.. బ్యాన్ కాలంలో కొత్త ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్లు తీసుకోవడాన్ని నిరోధించేవారు. కానీ కొత్త నియమాల ప్రకారం.. పోర్ట్‌ఫోలియో రిస్క్ తగ్గించే విధంగా ట్రేడింగ్‌ను అనుమతిస్తారు. ఇది ట్రేడర్లకు మద్దతుగా ఉంటుంది.

3. ఇంట్రాడే పొజిషన్ లిమిట్స్:
ఇండెక్స్ డెరివేటివ్స్‌లో రోజు మధ్యలో పొజిషన్లను నిరంతరం ట్రాక్ చేస్తూ.. ఒక ట్రేడింగ్ సంస్థకు రూ.5,000 కోట్ల నెట్ అలాగే రూ.10,000 కోట్ల గ్రాస్ పొజిషన్లకు గరిష్టం ఉంటాయి.

4. వ్యక్తిగత స్థాయిలో పొజిషన్ పరిమితి:
ఒక ఇన్వెస్టర్ చేతిలో ఒకే షేర్ల ఫ్యూచర్స్ & ఆప్షన్స్ పొజిషన్లు, MWPLకు చెందిన 10%, ప్రొప్రైటరీ బ్రోకర్స్‌కు 20%, FPIs, బ్రోకర్స్‌కీ సంయుక్తంగా 30% వరకు మాత్రమే హోల్డ్ చేసుకునేందుకు వీలుంటుంది.

5. భవిష్య నిర్మాణ మార్పులు:
నవంబర్ 3 నుంచి కొత్త అర్హతలతో డెరివేటివ్స్ ట్రేడింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అలాగే డిసెంబర్ 6 నుండి F&O సెగ్మెంట్లో ప్రీ-ఓపెన్, పోస్ట్-క్లోజింగ్ సెషన్స్ ఉంటాయి.

ఈ నియమాల వల్ల డెరివేటివ్స్ మార్కెట్‌లో ఉండే అధిక స్పెక్యులేటివ్ ట్రేడింగ్ తగ్గి.. మార్కెట్ స్థిరత్వం మెరుగవుతుందని సెబీ భావిస్తోంది. ఇది చిన్న ట్రేడర్లకు రక్షణను కల్పించనుంది. మార్కెట్ లో నిజమైన విలువ పై ట్రేడింగ్ కి మాత్రమే ప్రేరణ ఉంటుంది. సెబీ గతంలో కూడా వారాంత ఎక్స్‌పైరీ తగ్గించడం, లాట్ సైజులు పెంచడం, అప్ ఫ్రంట్ ప్రీమియం వసూలు చేయడం వంటి పలు నియమాలు తీసుకున్నది. మెుత్తానికి భారత మార్కెట్లు కొత్త ట్రేడర్లకు సురక్షితంగా మార్చేందుకు సెబీ రూల్స్ మార్పులకు శ్రీకారం చుట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad