Sunday, November 16, 2025
Homeబిజినెస్TCS Results: గత క్వార్టర్ కంటే తగ్గిన టీసీఎస్ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్..

TCS Results: గత క్వార్టర్ కంటే తగ్గిన టీసీఎస్ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్..

TCS Q2 Earnings: ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2025 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభం సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 1.4% అధికం.. కానీ మార్కెట్ అంచనాలకన్నా తక్కువగా ఉంది. అలాగే ఈ ఏడాది మెుదటి త్రైమాసికంతో పోల్చితే 5 శాతానికిపైగా తగ్గుదలను నమోదు చేసింది. ఇక సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం రూ.65,799 కోట్లుగా నమోదు అయింది. ఇది గత సంవత్సరం కంటే 2.4% పెరుగుదలను చూసింది. ఈ ఆదాయం జూన్ 2025 త్రైమాసికంతో పోల్చితే 3.72% తగినట్లు ఉంది.

- Advertisement -

టీసీఎస్ తన వ్యాపారంలో డేటా, క్లౌడ్, AI ఆధారంగా వేగవంతమైన మార్పులు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద AI ఆధారిత సాంకేతిక సేవల సంస్థగా మారడంపై దృష్టి సారిస్తున్నట్లు సీఈఓ కే. కృతివాసన్ ఈ సందర్భంగా చెప్పారు. కొత్త AI టూల్స్, సేవల ట్రాన్స్‌ఫార్మేషన్ యూనిట్ నిర్మాణం కూడా ఇదే లక్ష్యానికి తోడ్పడుతుంది. ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సెక్సారియా ప్రస్తావించినట్లుగా.. సంస్థ అన్ని విభాగాల్లో మంచి వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో కంపెనీ తన వ్యయాలను నియంత్రిస్తూ మార్జిన్లను పెంచడం సహాయపడ్డాయని చెప్పారు.

త్రైమాసిక ఫలితాల ప్రకటనలోని డేటా ప్రకారం TCS 6.13 లక్షల ఉద్యోగులను ప్రస్తుతం కలిగి ఉంది. ఇదే క్రమంలో కంపెనీ అట్రిషన్ రేటు 13.8%గా ఉంది. కంపెనీ తాజాగా ఒక్కో షేరుకు రెండవ ఇంటరిమ్ డివిడెండ్ రూ.11 చొప్పున ప్రకటించింది. ఈ డివిడెండ్ నవంబర్ 4, 2025 న చెల్లించబడుతుంది. అలాగే ఇందుకోసం రికార్డ్ డేట్ అక్టోబర్ 15, 2025 గా నిర్ణయించారు. కంపెనీ 10 బిలియన్ డాలర్లు విలువైన పెద్ద ఒప్పందాలను కూడా సాధించింది. దేశీయంగా ఏఐ డేటా సెంటర్ల కోసం కూడా కంపెనీ భారీగానే వెచ్చిస్తోందని వెల్లడైంది.

TCS తమ పెట్టుబడులను సాంకేతిక, సామర్థ్యాల అభివృద్ధి, భాగస్వామ్య విస్తరణలపై మరింత పెడుతుంది. దీని ద్వారా రానున్న కాలంలో తాను ప్రపంచంలోని అతి పెద్ద AI ఆధారిత సాంకేతిక సేవల సంస్థగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad