Best Range EVs: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ వాహనాలు పెట్రోల్ ఖర్చులు తగ్గించడమే కాకుండా, పర్యావరణ హితంగా ఉంటాయి. ఎవరైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఎంత రేంజ్‌ను అందిస్తుందో చూస్తుంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా టూవీలర్ తయారీ కంపెనీలు ఒక్క ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా తరచుగా ఛార్జింగ్ అవసరం లేని, సింగల్ చార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే, దీర్ఘకాలిక పనితీరును అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ క్రింది ఐదు మోడల్‌లు మీకు ఉత్తమ ఎంపిక అవుతాయి.
Simple Energy One
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకే ఛార్జ్‌తో దాదాపు 248 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది 5 kWh బ్యాటరీతో వస్తుంది. 105 km/h గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీని అతిపెద్ద హైలైట్ ఏమిటంటే? ఇది ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ నుండి వచ్చింది. సింపుల్ ఎనర్జీ వన్ డిజైన్, పనితీరు రెండూ అద్భుతంగా ఉన్నాయి.
also read:Jio: కేవలం కాలింగ్ కోసమే రీఛార్జ్ చేయాలా..? అయితే ఈ జియో రీఛార్జ్ ప్లాన్ మీకోసమే!
Komaki XR7
కంపెనీ ప్రకారం..ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌తో దాదాపు 322 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 3 kW మోటారుతో నడిచే ఇది 55 km/h గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ ధర పరిధిలో మరే ఇతర స్కూటర్ ఇంత రేంజ్‌ను అందించదు. నగరంలో రోజూ తక్కువ దూరం ప్రయాణించాల్సిన వారికి ఇది అనువైనది.
Ola S1 Pro Plus (Generation 3)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌తో 320 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఇది 5.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు దాదాపు 141 కి.మీ. దీని 0 నుండి 80% వరకు చార్జ్ చేయడానికి దాదాపు 7 గంటలు పడుతుంది. దీని ఫీచర్లు చూస్తే లాంగ్ రేంజ్, హై స్పీడ్, స్మార్ట్ ఫీచర్లతో నిండిన డాష్‌బోర్డ్ ఉన్నాయి.
Aether Rizta
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ బట్టి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 123 నుండి 160 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది 2.9 నుండి 3.7 kWh బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది రోజువారీ ప్రయాణీకులకు సరైన ఎలక్ట్రిక్ స్కూటర్.
BGauss Max C12
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌లో దాదాపు 123 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది 2.7 kWh బ్యాటరీతో శక్తినిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది సరసమైనది, తేలికైనది, నగరంలో రోజువారీ ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది.
నోట్: మీరు లాంగ్ రేంజ్, హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకుంటే ఓలా S1 ప్రో ప్లస్ లేదా సింపుల్ వన్ మీకు సరైనది. అలాగే మీరు బడ్జెట్, రోజువారీ ఉపయోగం కోసం చూస్తున్నట్లయితే ఏథర్ రిజ్టా లేదా బిగాస్ మ్యాక్స్ సి12 మంచి ఎంపికలు.


