Saturday, November 15, 2025
Homeబిజినెస్TVS Orbiter EV: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. చాలా తక్కువ ధరకే 158 కి.మీ...

TVS Orbiter EV: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. చాలా తక్కువ ధరకే 158 కి.మీ ప్రయాణించవచ్చు!

TVS Orbiter EV Launch: భారత్‌లో ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ సేల్స్‌ క్రమంగా పెరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా వరకు టాప్ కంపెనీలు ఈవీ ఉత్పత్తులపై ఫోకస్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టూవీలర్‌ సంస్థ టీవీఎస్‌ మార్కెట్‌లోకి కొత్త స్కూటర్‌ని తీసుకువచ్చింది. టీవీఎస్‌ ఆర్బిటర్‌ (TVS Orbiter EV) అనే పేరుతో తీసుకువచ్చిన ఈ స్కూటర్‌తో మరొక లైనప్‌ ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ధరను రూ.99,900 (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ సరికొత్త ఈవీ స్కూటర్‌ ఇది వరకే అందుబాటులో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ నుంచి కొన్ని డిజైన్‌, కాస్మొటిక్స్‌ని పంచుకుంటుంది. అంతే కాకుండా డజన్ల కొద్ది ఫీచర్లు ఇందులో కలవు. ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు..

డిజైన్‌ మెప్పించిందా?: డిజైన్ పరంగా ఆర్బిటర్ సరికొత్తగా ఫన్నీ, మోడ్రన్‌లో లుక్‌లో కనిపిస్తుంది. ఈ స్కూటర్‌ని 7 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో సీటు పొడవు 845 మిమీ, ఫ్లోర్ బోర్డ్ కూడా 290 మిమీ లతో విశాలంగా ఉంటుంది. హ్యాండిల్ బార్ రైడర్‌కి సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ చేసేందుకు ఉపక్రమిస్తుంది. ఇందులో 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, 169 మిమీ  గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. ఇక వీల్స్‌ విషయానికి వస్తే టీవీఎస్ ముందు 14 ఇంచెస్‌, వెనక 12-ఇంచెస్‌ వీల్‌ అందించారు. ముందు భాగంలో అల్లాయ్ వీల్, వెనుక భాగంలో 12 అంగుళాల ఎలక్ట్రిక్ మోటార్‌తో మిళితమై ఉండే వీల్‌ కలదు.

- Advertisement -

బ్యాటరీ, రేంజ్‌: ఈ టీవీఎస్ స్కూటర్‌ 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 158 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా కలదు. 

ఫీచర్లు: స్కూటర్‌ చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్, మోబైల్‌ పాకెట్స్‌, ఓటీఏ అప్డేట్స్ (వైర్‌లెస్‌) ఉన్నాయి. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్‌, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ని రైడర్ పొందుతారు. హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్‌తో పాటు స్కూటర్ కింద పడే సమయంలో ఎలక్ట్రిక్ మోటారు కటాఫ్‌ అయ్యే ఆప్షన్‌ని కూడా అందించారు.

ఈ స్కూటర్‌ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా ఏథర్‌, ఓలా, చేతక్‌ ఈవీ లకు ఈ స్కూటర్‌ కాంపిటీషన్‌ ఇచ్చే  అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ ధర తక్కువ కావడం.. మంచి ఫీచర్లు అందించడంతో వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయనున్నారు. మొత్తానికి ఈ నయా స్కూటర్‌ మార్కెట్‌లో ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad