Saturday, November 15, 2025
Homeబిజినెస్Volvo EX30: వోల్వో నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఫుల్‌ ఛార్జ్‌లో 480 కి.మీ రేంజ్!

Volvo EX30: వోల్వో నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఫుల్‌ ఛార్జ్‌లో 480 కి.మీ రేంజ్!

Volvo EX30 Launch: వోల్వో తన సరికొత్త EX30 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Volvo EX30 Electric SUV)ని అధికారికంగా భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రారంభ ధర కింద కేవలం రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకే దీనిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఆఫర్ ధర అక్టోబర్ 19, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ తర్వాత రూ.41 లక్షలకు పెరుగుతుంది. ఇప్పటికే ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్‌ పూర్తి అవ్వగా.. డెలివరీలు నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

- Advertisement -

ఈ కారుని దేశీయంగా బెంగళూరులోని హోస్‌కోటే ప్లాంట్‌లో అసెంబుల్ చేశారు. ఈ కారు ద్వారా మార్కెట్‌లో మంచి గ్రిప్‌ని పెంచుకునేందుకు వోల్వో ప్రయత్నిస్తోంది. రూ. 40 లక్షల ధరతో హై ఎండ్‌ ప్రీమియం రేంజ్‌ ఫీచర్లను ఈ కారులో అందిస్తోంది.

బ్యాటరీ: ఈ కారు 69 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 272 bhp పవర్‌ని 343 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌పై 480 కిలోమీటర్ల భారీ రేంజ్‌ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.3 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 180 కిలోమీటర్లుగా ఉంది.

ఫీచర్లు: ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్లు కలవు. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ (Google బిల్ట్-ఇన్‌తో) వస్తుంది. మంచి మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేయడం కోసం ఇందులో హర్మన్ కార్డాన్ 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ని కంపెనీ అందించింది. 11 kW వాల్‌బాక్స్ ఛార్జర్ కలదు. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లతో ఇంటీరియర్‌ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

ఈ కారుపై మూడు సంవత్సరాల స్టాండర్డ్‌ వారంటీ, 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా కలదు. సేఫ్టీ కోసం ADAS, 360° కెమెరా, లేన్-కీప్‌ అసిస్ట్ సిస్టమ్‌ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ వోల్వో EX30 ప్రధానంగా హ్యుందాయ్ Ioniq 5, Kia EV6, BMW iX1, BYD Sealion 7తో మరికొన్ని టాప్‌ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad