AP ICET 2025 : ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 3, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫైనల్ ఫేజ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 6 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో icet-sche.aptonline.in వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేయాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జులై 25న ముగిసిన నేపథ్యంలో, మిగిలిన సీట్ల భర్తీకి ఈ ఫైనల్ ఫేజ్ కీలకం.
ALSO READ : MBA Admissions: మన అమ్మాయిల ఓటు..విదేశీ ఎంబీఏకే..!
ఏపీ ఐసెట్ 2025 పరీక్షను మే 7, 2025న ఆంధ్రా యూనివర్సిటీ 43 నగరాల్లో నిర్వహించింది. మొత్తం 34,131 మంది పరీక్ష రాయగా, 32,719 మంది (95.86%) అర్హత సాధించారు. ఫస్ట్ ఫేజ్‌లో 15,000కు పైగా సీట్లు భర్తీ కాగా, 33,000 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ సీట్లను ఫైనల్ ఫేజ్‌లో భర్తీ చేస్తారు, అవసరమైతే స్పాట్ అడ్మిషన్లు కూడా నిర్వహించవచ్చు.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 3 – 6, 2025
సర్టిఫికెట్ వెరిఫికేషన్: సెప్టెంబర్ 4 – 7, 2025
వెబ్ ఆప్షన్ల ఎంట్రీ: సెప్టెంబర్ 5 – 8, 2025
వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్: సెప్టెంబర్ 9, 2025
సీట్ కేటాయింపు: సెప్టెంబర్ 11, 2025
సెల్ఫ్ రిపోర్టింగ్ & కాలేజీ రిపోర్టింగ్: సెప్టెంబర్ 11 – 13, 2025
రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు icet-sche.aptonline.inలో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయాలి. జనరల్ కేటగిరీకి రూ. 1,200, రిజర్వ్‌డ్ కేటగిరీలకు రూ. 600 కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్ మార్కులు, రెసిడెన్స్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలి. సీటు కేటాయింపు అభ్యర్థి ర్యాంకు, కేటగిరీ, ప్రాధాన్యతల ఆధారంగా జరుగుతుంది.
ALSO READ : IBPS RRB 2025: నిరుద్యోగులకు భలే ఛాన్స్! 13,217 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!
సీటు పొందిన వారు నిర్ణీత గడువులోగా కళాశాలలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే, APSCHE స్పాట్ అడ్మిషన్లను ప్రకటించవచ్చు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.inని సందర్శించండి.


