ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2025 ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. మొత్తం 95.86శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఐసెట్‌కు 37,572మంది దరఖాస్తు చేసుకోగా.. 34,131 మంది పరీక్షకు హాజరయ్యారు.
మే 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. క్వాలిఫై అయిన వారిలో 15,176మంది అబ్బాయిలు, 17,543మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనోజ్ మేకా (విశాఖ) అత్యధిక మార్కులతో ఒకటో ర్యాంకు సాధించగా.. ఆ తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్‌ఆర్ కడప), ఎస్. కృష్ణసాయి (ఎన్టీఆర్ జిల్లా), వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్), రేవూరి మాధుర్య (గుంటూరు), షేక్ బషీరున్నీషా (అనకాపల్లి) టాప్ 5లో ఉన్నారు.