బ్యాంకు(Bank) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) శుభవార్త అందించింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ఉండదు. కేవలం డిగ్రీ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అక్కడ సెలెక్ట్ అయితే ఓ ఏడాది కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత మీ పనితీరును బట్టి మరో మూడు సంవత్సరాలు పొడిగస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ను సందర్శించండి.
మొత్తం పోస్టులు: 51
అర్హత: ఏదైనా డిగ్రీ
వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.150, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి.