Monday, November 17, 2025
Homeకెరీర్Free AI Courses: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్వయం పోర్టల్‌లో ఉచిత ఏఐ కోర్సులు.. ఇలా నేర్చుకోండి..!

Free AI Courses: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్వయం పోర్టల్‌లో ఉచిత ఏఐ కోర్సులు.. ఇలా నేర్చుకోండి..!

Free AI Courses in SWAYAM Portal: ప్రస్తుత టెక్‌ ప్రపంచంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ నేర్చుకుంటేనే ఫ్యూచర్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే, విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నడిపిస్తోన్న స్వయం (SWAYAM) పోర్టల్‌లో ఐదు కొత్త ఉచిత కృత్రిమ మేధస్సు కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌ను సైతం అందజేస్తుంది. ఇంటర్వూ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

- Advertisement -

పైథాన్ ద్వారా ఏఐ అండ్ ఎంఎల్‌ శిక్షణ

ఈ కోర్సు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాథమిక, ప్రాక్టికల్ శిక్షణను అందిస్తుంది. డేటా విజువలైజేషన్, లీనియర్ ఆల్జీబ్రా, బేసిక్ స్టాటిస్టిక్స్, ఆప్టిమైజేషన్ టెక్నిక్‌లు, ఎంఎల్‌ మోడల్ డిజైన్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు వారి స్వంత రియల్-వరల్డ్ డేటా సైన్స్ , ఎంఎల్‌ సొల్యూషన్‌లను రూపొందించుకోవచ్చు.

క్రికెట్ అనాలసిస్‌లో ఏఐ వాడకం

వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలోనూ ఏఐ ప్రాధాన్యత పెరిగింది.ఈ కోర్సులో ఏఐ ద్వారా క్రికెట్ డేటాను ఎలా ప్రాసెస్ చేయగలమో తెలుసుకోవచ్చు. ఈ కోర్సు డేటా సేకరణ, తయారీ, స్ట్రైక్ రేట్, బాస్రా వంటి పనితీరు కొలమానాలు, పైథాన్ ఉపయోగించి స్పోర్ట్స్ డేటా విజువలైజేషన్‌ను కవర్ చేస్తుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రికెట్ ఔత్సాహికులు, డేటా విశ్లేషకులు ఈ కోర్సు నుండి క్రికెట్ ఇన్ సైట్స్ సేకరించడం నేర్చుకుంటారు.

ఉపాధ్యాయుల కోసం ఏఐ

తరగతి గదిలో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడంలో ఏఐ కోర్సు ఉపయోగపడుతుంది. పాఠ్య ప్రణాళికలో ఏఐ, తరగతి గది ఎంగేజ్మెంట్ పెంచే పద్ధతులను ఏఐ కవర్ చేస్తుంది. ఉపాధ్యాయులు ఏఐ ద్వారా తరగతి గదులను స్మార్ట్, ప్రభావవంతమైన, విద్యార్థి-కేంద్రీకృతంగా మార్చగలరు.

భౌతిక శాస్త్రంలో కృత్రిమ మేధస్సు

సైన్స్ రంగంలోనూ ఏఐ వాడకం పెరిగింది. అందుకే, కేంద్ర ప్రభుత్వం భౌతిక శాస్త్రంలో ఏఐ వినియోగంపై ప్రత్యేక కోర్సు ప్రారంబించింది. మెషిన్ లెర్నింగ్ మోడల్స్, న్యూరల్ నెట్‌వర్క్‌లు, ఫిజిక్స్ సిమ్యులేషన్‌లు, డేటా-ఆధారిత సమస్య పరిష్కారం వంటి అంశాలు దీనిలో నేర్చుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత, భౌతిక శాస్త్ర విద్యార్థులు సంక్లిష్టమైన శాస్త్రీయ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు.

రసాయన శాస్త్రంలో ఏఐ వాడకం

సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రూపొందించబడిన ఈ కోర్సు కెమిస్ట్రీ, ఏఐ రెండింటినీ మిళితం చేస్తుంది. పైథాన్ ఆధారంగా మాలిక్యులర్ ప్రిడిక్షన్, రియాక్షన్ మోడలింగ్, డ్రగ్ డిజైన్, కెమికల్ అనాలిసిస్ వంటి అంశాలు ఈ కోర్సులో కవర్ అవుతాయి. ఈ కోర్సు ద్వారా డిజిటల్ కెమిస్ట్రీ నైపుణ్యాలను పొందే అవకాశం ఉంటుంది.

ఫైనాన్స్, అకౌంటింగ్‌లో ఏఐ

ఈ కోర్సు ఏఐ ద్వారా అకౌంటింగ్ పనులను ఎలా వేగంగా, సురక్షితంగా, ఆటోమేటెడ్‌గా చేయగలదనే విషయాలను కవర్‌ చేస్తుంది. అంతేకాదు, ఆటోమేషన్, అకౌంటింగ్‌లో మోసాలను గుర్తించడం, ఏఐ-ఆధారిత నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ కోర్సు ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాల్లో పనిచేసే నిపుణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad