IBPS RRB 2025 : బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) 13,217 ఉద్యోగాలకు CRP RRB XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 31, 2025న ఈ నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక అయినవారికి మంచి సాలరీ, పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్-I (PO), స్కేల్-II, స్కేల్-III పోస్టులు ఉన్నాయి. మొత్తం 28 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ALSO READ: BRS : గులాబీ గూటిలో కుంపటి: కవిత బహిష్కరణ వెనుక కారణాలు ఏంటంటే..?
పోస్టుల వివరాలు :
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)కు 7,972 ఖాళీలు, ఆఫీసర్ స్కేల్-Iకు 3,907, స్కేల్-IIకు 1,139 (అంతర్గతంగా ఎగ్రికల్చర్ ఆఫీసర్ 50, లా 48, CA 69, IT 87, జనరల్ బ్యాంకింగ్ 854, మార్కెటింగ్ 15, ట్రెజరీ మేనేజర్ 16), స్కేల్-IIIకు 199 ఉద్యోగాలు. ఈ పోస్టులకు డిగ్రీ 50% మార్కులతో పాసైతే చాలు. స్పెషలిస్ట్ పోస్టులకు MBA, CA వంటివి అవసరం. స్థానిక భాషలో ప్రావీణ్యం కూడా ఉండాలి. వయసు: అసిస్టెంట్‌కు 18-28 ఏళ్లు, స్కేల్-Iకు 18-30, స్కేల్-IIకు 21-32, స్కేల్-IIIకు 21-40 ఏళ్లు. SC/STకు 5 ఏళ్లు, OBCకు 3 ఏళ్లు వయసు సడలింపు ఉంది.
అప్లై డేట్స్ :
ఆన్‌లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 1 నుంచి 21, 2025 వరకు. ప్రీలిమ్స్ పరీక్షలు: POకు నవంబర్ 22-23, క్లర్క్‌కు డిసెంబర్ 6,7,13,14, 2025. మెయిన్స్: POకు డిసెంబర్ 28, క్లర్క్‌కు ఫిబ్రవరి 1, 2026. సింగిల్ ఎగ్జామ్ (స్కేల్ II & III) డిసెంబర్ 28, 2025.
సెలక్షన్ ప్రాసెస్ :
క్లర్క్‌కు ప్రీలిమ్స్, మెయిన్స్. POకు ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. స్కేల్ II & IIIకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది (1/4 మార్కులు కట్).
అప్లై విధానం :
ibps.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసి, ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఫీజు: జనరల్/OBCకు రూ.850, SC/ST/PWDకు రూ.175. డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు తర్వాత కన్ఫర్మేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ఈ రిక్రూట్‌మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అభ్యర్థులు అఫీషియల్ సైట్ చెక్ చేసి, సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ రేటు పెరుగుతుంది. మరిన్ని వివరాలకు ibps.in సందర్శించండి.


