దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNVST 2025 Results) విడుదలయ్యాయి. జనవరి 18న ఈ పరీక్ష నిర్వహించగా.. తాజాగా నవోదయ విద్యాలయ సమితి ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఇచ్చిన తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు తెలుచుకోవచ్చు. 6వ, 9వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అధికారులు రెండు వెయిటింగ్ లిస్టులను ఉంచుతారు. అడ్మిషన్‌కు ఎంపికైనా విద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపనివారు, సర్టిఫికెట్లు సమర్పించడంలో విఫలమైనవారి స్థానంలో మిగతా వారికి అవకాశాలు కల్పిస్తారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
navodaya.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో ‘JNVST క్లాస్ 6 ఫలితం 2025’ క్లిక్ చేయండి. 9వ తరగతి ప్రవేశాలకు పరీక్ష రాసిన వారు ‘JNVST క్లాస్ 9 రిజల్ట్ 2025’ లింక్‌పై క్లిక్ చేయండి. మీ రోల్ నంబర్, పుట్టినరోజు తేదీని ఎంటర్ చేయండి. అనంతరం ఫలితాలు వస్తాయి. కాపీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి.