PM Yashasvi Scholarship 2025: కేంద్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి పీఎం యశస్వి స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు.
ALSO READ: YS Viveka Murder : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 కు సుప్రీం బెయిల్
9, 10 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.75,000, 11, 12 తరగతుల విద్యార్థులకు రూ.1,25,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు ఆగస్ట్ 31, 2025లోపు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. PM YASASVI ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అదే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఆగస్ట్ 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ విద్యార్థులకు రూ.400, బీసీ వారికి రూ.300, ఎస్సీ/ఎస్టీ వారికి రూ.200. ఆగస్ట్ 24-28 మధ్య వెబ్ ఐచ్ఛికాల నమోదు, ఆగస్ట్ 25-28 మధ్య ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
ఇక ఆగస్ట్ 29న ఐచ్ఛికాలలో మార్పులు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు ఆగస్ట్ 31న, డిగ్రీ తరగతులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. సకాలంలో దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


