UPSC Job Notification 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 213 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: మొత్తం 213 పోస్టులు. ఇందులో అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు సైతం ఉన్నాయి.
విద్యార్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ (ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు అనేది పోస్టుల వివరాలను బట్టి 40 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.25 దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ అక్టోబర్ 2, 2025గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో విద్యార్హతలు గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 125
అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 32
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల సంఖ్య: 16
ఉర్దూ లెక్చరర్ పోస్టుల సంఖ్య: 15
డిప్యూటీ లీగల్ అడ్వైజర్ పోస్టుల సంఖ్య: 12
అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్ పోస్టుల సంఖ్య: 05
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల సంఖ్య: 03
అడిషనల్ లీగల్ అడ్వైజర్ పోస్టుల సంఖ్య: 02
డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్ పోస్టుల సంఖ్య: 02
అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్ పోస్టుల సంఖ్య: 01


