Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG VS SAHOO: సత్య దాదా ఎవరో కాదు.. సాహో పెదనాన్నే!

OG VS SAHOO: సత్య దాదా ఎవరో కాదు.. సాహో పెదనాన్నే!

SAHOO X OG: తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఏ ముహూర్తాన LCU అనే కాన్సెప్ట్ మొదలు పెట్టాడో గానీ, ఆడియన్స్ అందరూ ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన దీనికి ఆ సినిమా తో లింక్ ఉంది, దానికి ఈ సినిమాతో లింక్ ఉందనుకుంటూ సినిమా మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటూన్నారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా అదే ట్రెండ్ మొదలైంది, ‘ఓజి’ సినిమాతో, ‘సాహో’ సినిమాని లింక్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ సుజిత్ నుంచి వచ్చే సినిమాలు అన్ని ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటాయి అంటూ ఇప్పటినుంచే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఐతే అసలు సాహో సినిమా కి, ఓజి సినిమాకి ఉన్న లింక్ ఏంటి ?

ALSO READ: https://teluguprabha.net/cinema-news/superstar-rajinikanth-reveals-jailer-2-release-date/

SAHOO LINK: సత్య దాదా ఎవరో కాదు.. సాహో పెదనాన్నే!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకునిగా సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీ మూవీ విడుదలై బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ప్రీమియర్ షోల కలెక్షన్ పరంగా ఇండియా రికార్డ్ సృషించిన “ఓజీ”, నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించి సత్తా చాటింది.

కాగా, ఈ సినిమాకీ, ప్రభాస్ ‘సాహో’ మూవీకి ఒక ఆసక్తికరమైన లింక్ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సుజీత్. అది.. ప్రకాశ్ రాజ్ పోషించిన సత్యనారాయణ అలియాస్ సత్య దాదా ఎవరో కాదు.. స్వయానా సాహోకు పెదనాన్న అని తెలియజేయడం! అవును. ‘ఓజీ’ సెకండాఫ్‌లో కథలో భాగంగా సెకన్ల పాటు ‘సాహో’లోని ఓ సీన్‌ని చూపించాడు దర్శకుడు.

విలన్ అయిన ఓమీ (ఇమ్రాష్ హష్మీ) కాల్పనిక నగరమైన వాజీపై ఆధిపత్యం సాధించడం కోసం సత్య దాదా తమ్ముడైన నరంతక్ రాయ్ (జాకీ ష్రాఫ్)ను చంపేశాడని చెప్పే సందర్భంలో.. చిన్నవాడైన తన కొడుకు సాహోను తన అనుచరుడైన లాల్‌కు అప్పగిస్తూ “సాహో నా కొడుకు అనే విషయం ప్రపంచానికి తెలియకుండా పెంచు” అని రాయ్ చెప్పే సీన్‌ను చూపించారు. దాన్నిబట్టి సాహోకు సత్య దాదా పెదనాన్న అని చెప్పారన్న మాట.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-movie-hd-leak-fans-reaction/

ఇలా ‘ఓజీ’ కథకు, ‘సాహో’ కథకూ లింక్ పెట్టి ‘ఓజీ’కి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు సుజీత్. సినిమా చివరలోనూ ఓజీని అన్వేషించే జపనీస్ పాత్రతో పాటు మరో కీలక విలన్ కూడా బతికే ఉన్నట్లు చూపించి సీక్వెల్‌పై ఆసక్తిని రేకెత్తించాడు. అయితే ఆ సీక్వెల్‌లో ఇటు ఓజీ, అటు సాహో ఇద్దరూ కనిపిస్తారా అనేది సందేహాస్పదమే. ఎందుకంటే.. పవన్ కల్యాణ్, ప్రభాస్ కలిసి నటించడమంటే, అది సాధ్యమయ్యే పని కాదని ఎవరైనా చెప్పేస్తారు. ఒకవేళ సీక్వెల్ తీయడమంటూ జరిగితే సుజీత్ ఏం చేస్తాడో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad