Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభAMR Multiplex : హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో రూ.1కే సినిమా.. ఒక్కరోజు మాత్రమే

AMR Multiplex : హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో రూ.1కే సినిమా.. ఒక్కరోజు మాత్రమే

ఈ మధ్యకాలంలో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి. గతేడాది రూ.100 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.150 ఉంది. అలాగే రూ.200 నుండి రూ.300 ఉండే టికెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. పెద్ద హీరోల సినిమాలకైతే ధరలెలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డే, ఫస్ట్ షో అభిమాన హీరో సినిమా చూడాలంటే జేబుకు చిల్లే. అలాంటి ఈ రోజుల్లో ఓ మల్టీప్లెక్స్ సినీ లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే సినిమా చూపిస్తామని అనౌన్స్ చేసింది. అయితే ఈ ఆఫర్ ఏదో సినిమా విడుదల కోసం కాదు. ఆ మల్టీప్లెక్స్ ప్రారంభం సందర్భంగా ఆఫర్ ఇచ్చారు.

- Advertisement -

మౌలాలిలో ఇటీవల మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరుతో అత్యాధునిక మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ థియేటర్ డిసెంబర్ 15న ప్రారంభించనున్నారు. థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం తొలి రోజు షో లకు రూ.1 కే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించింది. తొలిరోజు ఏకంగా 11 సినిమాలను ప్రదర్శించనున్నారు. తెలుగు తో పాటు హిందీ సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. డిసెంబర్ 15న ఏ సినిమా చూడాలన్నా రూ.1కే చూడొచ్చని యాజమాన్యం తెలిపింది. తెలుగులో యశోద, గుర్తుందా శీతాకాలం, లవ్ టుడే, మసూద, హిట్ 2, చెప్పాలని ఉంది, పంచతంత్రం, కాంతార లతో పాటు హిందీలో భేడియా, దృశ్యం – 2 సినిమాలను ప్రదర్శించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News