Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభGunFire On Bigg Boss Winner: బిగ్‌బాస్‌-2 విజేత ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు

GunFire On Bigg Boss Winner: బిగ్‌బాస్‌-2 విజేత ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు

GunFiring On Bigg Boss OTT Season 2 Winner: బిగ్‌బాస్ ఓటీటీ (హిందీ) సీజన్ 2 విజేత, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన తెల్లవారుఝామున సుమారు 5.30 గంటల సమయంలో జరిగింది. ముగ్గురు అనుమానితులు బైక్‌పై వచ్చి కొంతసేపు ఎల్విష్ ఇంటి వద్ద ఉన్నారు. అనంతరం ఎల్విష్ ఇంటిపై దాదాపు 12 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/meeting-at-chiranjeevi-home-on-film-workers-wages-hike-issue/

ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో ఎల్విష్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్పటికప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి మొదటి అంతస్తు గదుల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు. అయితే సంఘటన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, కేవలం ఆయన కుటుంబ సభ్యులు, కేర్‌టేకర్ మాత్రమే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/latest-low-budget-films-an-unexpected-delight-with-huge-collections/

పోలీసు బృందాలు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి దర్యాప్తును ప్రారంభించాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పులకు ముందు ఎలాంటి బెదిరింపులు తమకు రాలేదని, కుటుంబసభ్యులు తమతో చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad