Hari Hara Veera Mallu Trolling: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ సహజం. వాస్తవానికి హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కానీ, వారి అభిమానులే కొట్టుకుంటుంటారు. ఇప్పటికే, చాలా పబ్లిక్ ఫంక్షన్స్‌లో మన హీరోలు తమ ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. మేము బాగానే ఉంటాము. మా సినిమాలు రిలీజైనప్పుడు మీరెందుకు గొడవలు పడతారు అని. సోషల్ మీడియా ఎస్టాబ్లిష్ అయ్యాక హ్యాష్ ట్యాగ్స్ తో నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రాబోతుంది. ఈ సినిమాపై ముగ్గురు స్టార్ హీరోల అభిమానులు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని ఎడిటెడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ ముగ్గురు హీరోలెవరు..?
ఎన్‌టిఆర్ అభిమానులు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్‌టిర్ నటించిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. వాస్తవానికి ఈ కథ ముందు పవన్ దగ్గరకే వెళ్ళింది. కథ మొత్తం విన్న ఆయన.. ఈ కథ నాకంటే తారక్ అయితే బాగా చేస్తాడని స్వయంగా పవన్ చెప్పారు. దాంతో అరవింద సమేత తారక్ వినడం ఓకే చేయడం సినిమా రావడం పెద్ద హిట్ అవడం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చి తారక్ ని విష్ చేశారు కూడా. కానీ, ఇప్పుడు తారక్ ఫ్యాన్సే వీరమల్లుని ట్రోల్ చేస్తున్నారు.
Also Read – Allu Arjun Office: ముంబైలో బన్నీ ఆఫీస్.. సపోర్ట్ చేస్తోన్న కొరియోగ్రాఫర్
అల్లు అర్జున్ అభిమానులు..
వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే అల్లు అర్జున్ అభిమానులు కూడా వీరమల్లు సినిమాపై పగ పట్టారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్స్ వద్ద జరిగిన ఘటనలో పవన్ కళ్యాణ్ బన్నీకి సపోర్ట్ చేయలేదని మనసులో పెట్టుకొని బాయ్కాట్ చేయమని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు.
మహేశ్ బాబు అభిమానులు….
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటారు. ఆ రకంగా మహేశ్ బాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల మధ్య మంచి బాండింగ్ ఉంది. పవన్ జన సైనికులు, భిమానులు జగన్ ని పలు సందర్భాలలో ఏకి పారేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మహేశ్ అభిమానులు పవన్ సినిమాపై పగ పట్టారు. ఈ ముగ్గురు హీరోల అభిమానులు తమ హీరోల వీడియోలను జత చేసి దేవర సాంగ్ తో ఓ వీడియోను ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి ఈ నెగిటివ్ కాంపేయిన్ నుంచి పవన్ వీరమల్లు సినిమా ఎలా తప్పించుకొని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read – Liquor Scam Case: జ్యుడీషియల్ కస్టడీకి మాజీ సీఎం కుమారుడు


