Kiran Abbavaram: లిప్‌లాక్స్ నేటి సినిమాల్లో కామన్‌గా మారాయి. రొమాంటిక్ మూవీస్, లవ్‌స్టోరీస్ అంటే లిప్‌లాక్‌లు ఉండాల్సిందే. ఒకప్పుడు సినిమాలో ముద్దుసీన్లు ఉన్నాయనే సంగతి సీక్రెట్‌గా దాచేవారు దర్శకులు. థియేటర్స్‌కు వచ్చిన ఆడియెన్స్‌ను లిప్‌లాక్స్‌తో సర్‌ప్రైజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాల ప్రమోషన్స్ కోసం లిప్‌లాక్‌లను వాడేస్తున్నారు. టీజర్స్, ట్రైలర్‌లలో లిప్‌లాక్‌లను చూపిస్తూ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నారు.
దీపావళికి రిలీజ్ కానున్న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీలో లిప్‌లాక్‌లకు కొదవ లేదట. సినిమాలో మొత్తం 16 లిప్‌లాక్ సీన్లు ఉన్నాయని ప్రమోషన్స్‌లో మేకర్స్ హింట్ ఇచ్చేశారు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని ఎక్కువగా లిప్‌లాక్‌లతోనే హాట్‌హాట్‌గా ప్రజెంట్ చేశాడట డైరెక్టర్. కే ర్యాంప్‌లో రొమాంటిక్ లవర్ బాయ్ టైప్ క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం కనిపించబోతున్నట్లు టాక్. ఈ క్యారెక్టర్‌కు జస్టిఫై చేయడం కోసమే 16 ముద్దు సీన్లు పెట్టారని అంటున్నారు. ఈ లిప్‌లాక్‌ల విషయంలో హీరోయిన్ బాగానే కో ఆపరేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Akhilesh Yadav : అఖిలేశ్ ఫేస్‌బుక్ ఖాతాపై వేటు – ప్రతిపక్షంపై కక్షసాధింపేనని ఎస్పీ ధ్వజం
సెన్సార్ రియాక్షన్…
ఈ లిప్‌లాక్‌లపై సెన్సార్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ముద్దు సీన్లు కట్ చేస్తే సినిమా స్టోరీ ఫ్లో మొత్తం మారిపోతుందని మేకర్స్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇదని ఇప్పటికే టీజర్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టాలీవుడ్‌లో హయ్యెస్ట్ లిప్‌లాక్ సీన్స్ ఉన్న సినిమాల్లో ఒకటిగా కే ర్యాంప్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.
కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు నాచురల్ లవ్‌స్టోరీస్, మాస్ మూవీస్ ఎక్కువగా చేశారు. వాటికి భిన్నంగా కే ర్యాంప్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ దీపావళికి కే ర్యాంప్‌తో పాటు మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అన్ని యూత్‌ఫుల్ కామెడీ రొమాంటిక్ సినిమాలే కావడం గమనార్హం. వాటి పోటీని తట్టుకొని కిరణ్ అబ్బవరం మూవీ ఎంత వరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే చిన్న సినిమాను నిర్మించాడు. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Also Read – Tara Sutaria: బికినీలో మత్తెక్కిస్తున్న బాలీవుడ్ నయా బ్యూటీ


