Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభ18 Pages Movie : 18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నిఖిల్ రేంజ్ కి...

18 Pages Movie : 18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నిఖిల్ రేంజ్ కి తక్కువే..

- Advertisement -

18 Pages Movie : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు కూడా. దీంతో మళ్ళీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా 18 పేజెస్ సినిమాతో రాబోతున్నారు.

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి వచ్చే సినిమా, అందులోనూ మళ్ళీ వీరిద్దరే జంటగా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే స్కోప్ ఉన్నా కూడా 18 పేజెస్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా కాకుండా కేవలం తెలుగు సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధారణంగా జరగడం విశేషం.

18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం – 3.50 కోట్లు
సీడెడ్ – 1.5 కోట్లు
ఆంధ్ర – 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.50 కోట్లు

మొత్తంగా 18 పేజెస్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో 13 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధిస్తే సినిమా హిట్ అయినట్టే. అయితే సాధారణంగానే నిఖిల్ సినిమాకి ఈ మాత్రం బిజినెస్ జరుగుతుంది. కానీ కార్తికేయ 2 తర్వాత కూడా ఇదే బిజినెస్ జరగడంతో ఇంత తక్కువా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ టార్గెట్ ని నిఖిల్ వారంలోపే బ్రేక్ ఈవెన్ చేస్తాడని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News