Saturday, November 15, 2025
HomeTop Stories80s Stars Reunion Party: 80స్ స్టార్స్ రీయూనియ‌న్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా చిరు, వెంకీ...

80s Stars Reunion Party: 80స్ స్టార్స్ రీయూనియ‌న్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా చిరు, వెంకీ – ఫొటోలు వైర‌ల్‌

80s Stars Reunion Party: తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన స్టార్స్ అంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. ఈ అరుదైన క‌ల‌యికకు 1980 స్టార్స్ రీ యూనియ‌ర్ పార్టీ వేదిక‌గా నిలిచింది. 1980, 90 కాలంలో ద‌క్షిణాదిలో టాప్ స్టార్స్‌గా వెలుగొందిన నాయ‌కానాయిక‌లు ప్ర‌తి రెండు, మూడేళ్ల‌కు ఓ సారి రీయూనియ‌ర్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సారి 1980 స్టార్స్ రీ యూనియ‌ర్ పార్టీ చెన్నైలో జ‌రిగింది. హీరోయిన్ క‌మ్ డైరెక్ట‌ర్ శ్రీప్రియ, రాజ్‌కుమార్ సేతుప‌తి ఇంట్లో శ‌నివారం జ‌రిగిన రీయూనియ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో 27 మంది స్టార్స్ సంద‌డి చేశారు.

- Advertisement -

స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌…
ఈ రీయూనియ‌న్ సెల‌బ్రేష‌న్స్‌కు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంక‌టేష్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. 1980, 90ల కాలం నాటి జ్ఞాప‌కాలు, ఆనాటి సినిమా ముచ్చ‌ట్ల‌ను గుర్తుచేసుకుంటూ స్టార్స్ ఈ రీయూనియ‌న్ పార్టీని ఆనందంగా జ‌రుపుకున్నారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత అంతా స్టార్స్ అంతా ఓ చోట చేర‌డం గ‌మనార్హం.

Also Read- Chiranjeevi: రికార్డ్ స్థాయిలో మ‌న శంక‌రవ‌ర ప్ర‌సాద్ గారు ప్రీ రిలీజ్ బిజినెస్ – మెగాస్టార్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్‌!

అప్ప‌టి టాప్ హీరోయిన్లు…
1980 స్టార్స్ రీయూనియ‌ర్ పార్టీలో చిరంజీవి, వెంక‌టేష్‌తో పాటు సురేష్, న‌రేష్, భాను చంద‌ర్‌, ప్ర‌భు, జ‌య‌రామ్‌, భాగ్య‌రాజా జాకీ ష్రాఫ్‌, రెహ‌మాన్, శ‌ర‌త్‌కుమార్‌ అటెండ్ అయ్యారు. 1980, 90 ద‌శ‌కంలో ద‌క్షిణాది ఇండ‌స్ట్రీని ఏలిన టాప్ హీరోయిన్లు జ‌య‌సుధ‌, ర‌మ్య‌కృష్ణ‌, న‌దియా, రాధ, సుహాసిని, సుమ‌ల‌త‌, ఖుష్బూ, పూర్ణిమ భాగ్య‌రాజా, లిజి, శోభ‌న‌, రేవ‌తి, మీనా, స‌రిత‌, ల‌త‌, స్వ‌ప్న‌తో పాటు మ‌రికొంత మంది పార్టీకి అటెండ్ అయ్యారు. 1980 స్టార్స్ రీయూనియ‌న్ పార్టీ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 1980 స్టార్స్ రీయూనియ‌న్ పార్టీ వేడుక‌లు గ‌త ఏడాదే జ‌ర‌గాల్సివుంది. కానీ చెన్నైలో వ‌చ్చిన వ‌ర‌ద విప‌త్తు కార‌ణంగా వాయిదావేశారు.

చిరంజీవి ట్వీట్‌…
రీయూనియ‌న్ తాలూకు ఫొటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు చిరంజీవి. ఈ యూనియ‌న్ వేడుక‌లు ఎన్నో అంద‌మైన జ్ఞాప‌కాల‌ను మిగిల్చాయ‌ని అన్నారు. ద‌శాబ్దాలుగా త‌మ మ‌ధ్య కొన‌సాగుతున్న బంధం విడ‌దీయ‌రానిద‌ని, ప్ర‌తిసారి మొద‌టి స‌మావేశంలానే ఉంటుంద‌ని చెప్పారు. ఈ రీయూనియ‌న్ పార్టీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనంటూ త‌న ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

Also Read- Chiru- Venky: స్పెషల్‌ ఫ్లైట్‌లో అగ్ర హీరోలు.. 80’s రీయూనియన్‌కి చిరు, వెంకీ

నాగార్జున మిస్సింగ్‌…
స్టార్స్ రీయూనియ‌న్ పార్టీకి టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున మిస్స‌య్యారు. బిగ్‌బాస్ షూటింట్‌తో పాటు ఇత‌ర క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల నాగార్జున అటెండ్ కాలేక‌పోయిన‌ట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad