Bigg Boss: బిగ్ బాస్ మేనియా మొదలైంది. బుల్లితెర ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ఈసారి మరింత వైవిధ్యంగా ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభం కానుండగా.. తాజాగా బిగ్ బాస్ టీమ్ షో లాంచ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించింది. ఓ కంటెస్టెంట్ హౌస్‌లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్‌బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది ఎంత వైవిధ్యంగా ఉండబోతోందో ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
1st Promo of Season 9 launch Episode#BiggBossTelugu9 pic.twitter.com/uHTf6NRJqW
— BigBoss Telugu Views (@BBTeluguViews) September 7, 2025
చదరంగం కాదు..రణరంగమే..
బిగ్ బాస్ రణరంగం మొదలైపోయింది. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అంటూ బిగ్ బాస్ సీజన్ 9కి హైప్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 9 సాగబోతుంది. కంటెస్టెంట్స్ ఎంపికను బట్టే సీజన్ హిట్టా ఫట్టా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి ఈ కంటెస్టెంట్స్ ఎంపిక పెద్ద టాస్క్ గానే మారింది. ఈ షోకు కంటెస్టంట్ల ఎంపిక కోసం పెద్ద ‘అగ్నిపరీక్ష’నే ప్రారంభించారు. ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఆశపడుతున్నారో.. అలాంటి సామాన్యులందరికీ అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ అగ్నిపరీక్షను నిర్వహించారు. దానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయిన నవదీప్, అభిజీత్, బిందుమాధవిలను జడ్జీలుగా పెట్టి.. శ్రీముఖి హోస్ట్‌గా అగ్నిపరీక్ష ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో 13 మంది టాప్ కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసి.. వారిలో నుంచి ఐదుగుర్ని నేరుగా హౌస్‌లోకి పంపించబోతున్నారు. అంటే బిగ్ బాస్ ఆటకి ముందు ఐదుగురు కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ ఎవరనేది ఫినాలే ఎపిసోడ్‌లో మాత్రమే చూసేవారు. కానీ ఈ సీజన్‌లో వినూత్నంగా.. అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు. హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఆ ఐదురుగు కామనర్స్ ఎవరు? అనేది చూద్దాం.
Read Also: Trump: మరోసారి నోరుజారిన నవారో.. ఫ్యాక్ట్ చెక్ తో తిప్పికొట్టిన ఎక్స్
అగ్నిపరీక్ష ద్వారా ఐదుగురు..
ఈ సీజన్‌లో అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు సామాన్యులు. సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య రణరంగం ఉండబోతుంది. అయితే, . ఈ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్స్ ఐదో లేదా ఆరుగురు ఉంటారని మొదటి నుంచి వినిపించిన మాట. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్‌ని మాత్రమే హౌస్‌లోకి పంపించబోతున్నారు. వీరిని ఓటింగ్ ద్వారానే కాకుండా జడ్జీల నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ఐదుగుర్ని సెలెక్ట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ, మాస్క్ మెన్ హరీష్, మర్యాద మనీష్‌లను జడ్జీలు నేరుగా ఎంపిక చేయగా.. ప్రియ శెట్టి, జవాన్ కళ్యాణ్ ఓటింగ్ ద్వారా ఎంపికైనట్టు తెలుస్తోంది.
Read Also: Archery: వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్.. భారత్ కు రెండు పతకాలు..!


